కంత్రి తన రాకను మే తొమ్మిదివ తేదీకి వాయదావేసుకున్నాడు. మొదట మే 7వ తేదీకే థియేటర్లలలో హంగామా చేస్తానని హామి ఇచ్చాడు. కాని పోస్ట్ ప్రొడక్షన్ వర్క్, షూటింగ్ కొంత బ్యాలెన్స్ ఉండటంతో ఈ మార్పు తప్పేటట్లు లేదు. దర్శకుడు మొహర్ రమేష్ తన శక్తియుక్తులన్నిటిని ఈ సినిమా పైనే కేంద్రీకరించి చేస్తున్నాడట. ఎందుకంటే కెరీర్ (తెలుగులో) ప్రారంభంలోనే పెద్ద హీరోని డైరక్ట్ చేసే అవకాశం రావటం సాధారణంగా చాలా అరుదు. దాంతో ఈ సినిమాతో తనను తాను నిరూపించుకుని తెలుగులో మెగా మాస్ డైరక్టర్ గా సెటిల్ అవ్వాలని చూస్తున్నాడట. దానికోసం ప్రతీ సన్నివేశం హై ఓల్టేజి తో ఉండాలని తాపత్రయపడుతున్నాడట. ప్రస్తుతం కంత్రి హైదరాబాద్ అవుట్ స్కర్ట్స్ చర్లపల్లి లో షూటింగ్ జరుపుకుంటున్నాడు. యన్టీఆర్, తనీషాల మధ్య జరిగే కొన్ని కీలక సన్నివేశాలు అక్కడ చిత్రీకరిస్తున్నారు. వచ్చేవారం నుండి నిర్మాత అశ్వనీ దత్ భారీ ప్రచారానికి ప్లాన్ చేస్తున్నాడట.