ఇదే తొలిఅనుభవం: ఆడియో వేడుకలో కపిల్ దేవ్(ఫోటోలు)

By Bojja Kumar

హైదరాబాద్: క్రికెట్ లెజెండ్ కపిల్ దేవ్ తెలుగు సినిమా ఆడియో వేడుకలో సందడి చేసారు. శ్రీ భావన ఫిలింస్ పతాకంపై రోహిత్ రెడ్డి, రాజ్ అర్జున్, నేహ దేశ్ పాండే, కృతిక నటీనటులుగా రాజారెడ్డి నిర్మిస్తున్న 'దిల్ దివానా' చిత్రం ఆడియో వేడుకకు కపిల్ దేవ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ చిత్రం ద్వారా శేఖర్ కమ్ముల శిష్యుడు తుమ్మ కిరణ్ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ఆర్. రామ్ నారాయణ్ సంగీతం అందించారు.

కపిల్ దేవ్‌తో పాటు తెలుగు సినిమా ప్రముఖులు దిల్ రాజు, శేఖర్ కమ్ముల, తెలుగుదేశం పార్టీ నాయకుడు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి హాజరయ్యారు. వీరితో పాటు హైదరాబాద్ నగర పొలీస్ కమీషనర్ అనురాగ్ శర్మ, సైబరాబాద్ కమీషనర్ సివి ఆనంద్ తదితరులు కూడా హాజరయ్యారు.

బుధవారం సాయంత్రం హైదరాబాద్‌లోని రాక్ హైట్స్‌లో జరిగిన ఈ కార్యక్రమంలో కపిల్ దేవ్ చేతుల మీదుగా ఈ చిత్రం ఆడియో సీడీలు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కపిల్ దేవ్ మాట్లాడుతూ 'సినిమా ఫంక్షన్లకు రావడం ఇదే తొలిసారి, ఈ తొలి అనుభవం నాకు స్వీట్ మెమోరీస్. ఈ చిత్రం హిందీలో వస్తే తప్పకుండా చూస్తాను. మ్యూజిక్ బాగుంది. ఈసినిమా టీంకు సక్సెస్ రావాలని కోరుకుంటున్నాను' అన్నారు.

దర్శకుడు మాట్లాడుతూ

దర్శకుడు మాట్లాడుతూ


సినిమా గురించి దర్శకుడు తుమ్మ కిరణ్ మాట్లాడుతూ...క్రికెట్ లెజెండ్ కపిల్ దేవ్ ఆడియో వేడుకకు వచ్చి మమ్మల్ని ఆశీర్వదించడం ఆనందంగా ఉంది. ఈ సినిమా తెరకెక్కించే విషయంలో నాకు సపోర్టుగా నిలిచిన అందరికీ ధన్యవాదలు అని వ్యాఖ్యానించారు.

శేఖర్ కమ్ముల మాట్లాడుతూ..

శేఖర్ కమ్ముల మాట్లాడుతూ..


నా సినిమాలకు దర్శకత్వ శాఖలో పని చేసిన కిరణ్ చాలా హార్డ్ వర్కర్. సినిమా చాలా క్లీన్‌గా తీసాడు. పాటలు చాలా బాగున్నాయి. ఈ చిత్ర టీంకు మంచి పేరు రావాలని కోరుకుంటున్నాను అన్నారు.

దిల్ రాజు మాట్లాడుతూ..

దిల్ రాజు మాట్లాడుతూ..


శేఖర్ కమ్ముల హ్యాపీడేస్ మాదిరి ఈ సినిమాలోనూ మంచి కంటెంట్ కనిపిస్తుంది. పాటలు, ట్రైలర్స్ బాగున్నాయి. ఈ చిత్రానికి మూడు కోట్లు వచ్చినా సూపర్ సక్సెస్ అయినట్లే అన్నారు.

సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి మాట్లాడుతూ..

సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి మాట్లాడుతూ..


శేఖర్ కమ్ముల లీడర్ చిత్రం చూసాను. రాజకీయాల్లో మార్పు తెచ్చే విధంగా ఉన్న సినిమా. ఆయన శిష్యుడి సినిమా అంచనాలకు తగిన విధంగా ఉంటుందని కోరుకుంటున్నాను. నా స్నేహితుడి తనయుడు రోహిత్ హీరోగా పరిచయం అవుతున్నాడు. ఈ సినిమా సక్సెస్ అయి అందరికీ మంచి పేరు రావాలని కోరుకుంటున్నాను అన్నారు.

హీరో అర్జున్ మాట్లాడుతూ..

హీరో అర్జున్ మాట్లాడుతూ..


నాకు ఈ చిత్రంలో అకాశం రావడం చాలా ఆనందంగా ఉంది. పాటలు బాగున్నాయి. సినిమాను ప్రేక్షకులు ఆదరిస్తారని ఆశిస్తున్నాను అన్నారు.

హీరో రోహిత్ మాట్లాడుతూ..

హీరో రోహిత్ మాట్లాడుతూ..


సినిమా చాలా ఎంజాయ్ చేస్తూ చేసాం. ఈ టీంతో మళ్లీ చాన్స్ రావాలని కోరుకుంటున్నాను. సినిమా ప్రేక్షకులకు నచ్చుతుందని ఆశిస్తున్నాను అన్నారు.

త్వరలో విడుదల

త్వరలో విడుదల


త్వరలోనే ‘దిల్ దివానా' చిత్రాన్ని విడుదల చేసేందుకు చిత్ర యూనిట్ ప్రయత్నాలు చేస్తోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X