twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    కపూర్ల ఇంటిలో దెయ్యాల తిష్ట.. కూల్చివేతకు సిద్ధం.. రణ్‌బీర్‌ కపూర్‌కు ఆ సర్కార్ షాక్

    |

    ప్రముఖ నటుడు పృథ్వీరాజ్ కపూర్ కుమారుడు దిగ్గజ దర్శక, నిర్మాత, నటుడు రాజ్‌ కపూర్ పాకిస్థాన్‌లోని పేషావర్‌ జన్మించారు. దేశ విభజన సమయంలో వారి కుటుంబం ముంబై వచ్చి సెటిల్ అయ్యారు. బాలీవుడ్‌లోపాగా వేసిన మొట్టమొదటి ఫ్యామిలీ కపూర్లదే. ఇప్పటికి వారి వారసత్వ మూలాలు అక్కడ ఉన్నాయి. ఈ క్రమంలో వారికి వారసత్వంగా సంక్రమించిన భవనాలు, ఆస్తులు పాకిస్థాన్‌లోని పలు ప్రాంతాల్లో ఉన్నాయని చెప్పుకొంటారు. అయితే అలాంటి వారసత్వ భవనాన్ని పాక్ ప్రభుత్వం కూల్చివేతకు పాల్పడుతున్నారనే వార్త ఫ్యామిలీ కుటుంబంలో ఆవేదనకు గురిచేస్తున్నది. వివరాల్లోకి వెళితే..

    2018లో మ్యూజియంగా మార్చాలని రిషీ కపూర్

    2018లో మ్యూజియంగా మార్చాలని రిషీ కపూర్

    పాకిస్థాన్‌లోని పేషావర్ ప్రాంతంలో కపూర్ల వంశానికి పురాతన భవనం ఉంది. దానిని కపూర్ హవేలీ అని పిలుస్తారు. అయితే 2018లో ఆ భవనాన్ని మ్యూజియంగా మార్చాలని పాకిస్థాన్ ప్రభుత్వానికి నటుడు రిషికపూర్ వినతి పత్రాన్ని సమర్పించారు. రిషి కపూర్ కోరికకు స్పందించిన పాక్ ప్రభుత్వం ఆ వారసత్వ భవనాన్ని మ్యూజియంగా మారుస్తామిన హామీ ఇచ్చింది.

    నగల వ్యాపారి ఆధీనంలో బంగ్లా

    నగల వ్యాపారి ఆధీనంలో బంగ్లా

    అయితే పరిస్థితులు మారిన నేపథ్యంలో కపూర్లకు ఇష్టమైన ఆ పురాతన భవనాన్ని కూల్చివేయాలని నిర్ణయం తీసుకొన్నారు. అందుకు కారణం ఇప్పుడు ఆ భవనం హాజీ మహ్మద్ ఇస్రార్ అనే జ్యువెలర్ వ్యాపారీ ఆధీనంలో ఉంది. ఆ భవనాన్ని వాణిజ్య సముదాయంగా మార్చాలనే ఉద్దేశంతో కూల్చివేతకు పాల్పడుతున్నారని తెలిసింది.

    పురాతన భవనంపై కేసులు

    పురాతన భవనంపై కేసులు

    కపూర్ల వంశానికి చెందిన వారసత్వ భవనం ఖైబర్ ఫక్తుంఖ్వా ప్రావిన్స్‌లోని పేషావర్‌లోని హవేలీకి దూరంగా విసిరివేయబడినట్టు ఉంది. తొలుత ఆ భవనాన్ని తొలుత పాకిస్థాన్ ప్రభుత్వం కొనుగోలు చేసి పర్యాటక ప్రాంతంగా మార్చాలని భావించింది. అయితే ఆ భవనం కూల్చివేతపై కేసులు నమోదు కావడంతో ఆ ప్రయత్నాన్ని విరమించుకొన్నది.

     దెయ్యాలు, భూతాలు ఉన్నాయనే ప్రచారం

    దెయ్యాలు, భూతాలు ఉన్నాయనే ప్రచారం

    అలాగే కపూర్లకు సంబంధించిన పురాతన భవనం బూత్ బంగ్లా అంటూ స్థానికులు ప్రచారం చేయడం కూడా ప్రభుత్వ అధికారులు వెనుకంజ వేయడానికి కారణంగా మారిందని చెప్పుకొంటున్నారు. ఆ బంగ్లాలో భూతాలు ఉన్నాయనే భ్రమలో స్థానికులు ఉండటం కారణంగా ఆ భవనం వివాదంలో కూరుకుపోయిది.

    Recommended Video

    Chitram X Movie Trailer | Latest Movie Trailers
    రిషికపూర్ మరణం తర్వాత

    రిషికపూర్ మరణం తర్వాత

    2018లో పాకిస్థాన్ ప్రభుత్వంతో చర్చలు జరిగిన బాలీవుడ్ నటుడు రిషీ కపూర్ ఇటీవల క్యాన్సర్ వ్యాధితో కన్నుమూశారు. ఈ క్రమంలో కపూర్ల ఫ్యామిలీలో ఆ భవనాన్ని కాపాడే బాధ్యత కరువైందనే మాట వినిపిస్తుంది. ఆ భవనంపై ఎవరికి అంతగా ఇంట్రెస్ట్ లేదని తెలుసుకొన్న నగల వ్యాపారి ఆ భవనాన్ని కూల్చి వాణిజ్య సముదాయాన్ని నిర్మించేందుకు సిద్ధమవుతున్నట్టు సమాచారం.

    English summary
    Kapoor's ancestral home to demolish in Peshawar city after Rishi Kapoor death. Reports suggest that, In 2018, Rishi Kapoor has requested thier ancestral home to convert as Museum. But Now, Officials are going to demolish the building to construct commercial complex.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X