twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    శ్రీకాంత్‘దేవరాయ’కు కాపునాడు తీవ్ర హెచ్చరిక

    By Srikanya
    |

    హైదరాబాద్ : శ్రీకృష్ణ దేవరాయలును కించపరిచేలా చిత్రీకరించిన 'దేవరాయ' చిత్రంలోని అసభ్యకర దృశ్యాలను వెంటనే తొలగించకపోతే ఆ సినిమా ప్రదర్శనను అడ్డుకోవటమేగాక సెట్‌లను తగులబెడతామని రాష్ట్ర కాపునాడు శనివారం ఒక ప్రకటనలో హెచ్చరించింది. శ్రీకృష్ణదేవరాయల పాలనను అవహేళన చేస్తే ఊరుకోమని కాపునాడు అధ్యక్షులు నారాయణస్వామి రాయల్ పేర్కొన్నారు. శ్రీకాంత్‌ ద్విపాత్రాభినయం చేస్తున్న సినిమా 'దేవరాయ'. విధిశ హీరోయిన్స్ . నానికృష్ణ దర్శకుడు. నానిగాడి సినిమా సమర్పణలో సన్‌రే ఇంటర్నేషనల్‌ సినిమా సంస్థ నిర్మిస్తోంది. కిరణ్‌ జక్కంశెట్టి, నానికృష్ణ నిర్మాతలు.

    చారిత్రక, సాంఘిక అంశాల సమ్మేళనంతో 'దేవరాయ' చిత్రాన్ని మలిచామని నిర్మాతలు చెప్తున్నారు. ఈ చిత్రం షూటింగ్‌ పూర్తై నిర్మాణానంతర పనుల్లోభాగంగా రీరికార్డింగ్‌ సైతం పూర్తయింది. ప్రస్తుతం డిటియస్‌ పనులు జరుగుతున్నాయి. నిర్మాతలు మాట్లాడుతూ ''క్రీ.శ.1500లో శ్రీకృష్ణదేవరాయలు కాలంలో జరిగిన ఓ సంఘటన ఆధారంగా తెరకెక్కింది. హీరో,హీరోయిన్స్ పై 3పాటల్ని బ్యాంకాక్‌, పటాయ, నోమన్‌ ఐలాండ్‌, కోలార్‌ ఐలాండ్‌లలో చిత్రీకరించాం. షారూఖ్‌ ఖాన్‌ 'మర్జానీ..' పాటకు నృత్యదర్శకత్వం వహించిన ప్రసన్న సుజిత్‌ వీటికి నృత్యాలందించారు'' అన్నారు.

    దర్శకుడు మాట్లాడుతూ ''గతం తెలుసుకొన్న మనిషి కథ ఇది. అమలాపురంలో దొరబాబు పేరు చెబితే చాలు... పేకాట రాయుళ్లు పండగ చేసుకొంటారు. ఎందుకంటే మనోడికి ఎప్పుడూ ముక్క తిరిగిందే లేదు. అందుకే దొరబాబుతో ఆడాలి, వాడి జేబులోని డబ్బులన్నీ మన చేతికి అందేయాలి.. అని కాపు కాస్తారు. అదొక్కటే కాదు.. దొరబాబుకు చాలా సరదాలే ఉన్నాయి. ఆ అలవాట్లతో ఇల్లూ వాకిలీ గుల్ల చేసుకొన్నాడు. ఆ తరవాత ఏమైంది? అసలు దొరబాబుకీ రాయలవారి వంశానికీ సంబంధం ఏమిటి? జల్సారాయుడిగా పేరుతెచ్చుకొన్న దొరబాబు గతమేంటి? అనేదే కథలో కీలకం. ఈ విషయాలు తెలియాలంటే 'దేవరాయ' సినిమా చూడాల్సిందే.

    అలాగే ... శ్రీకృష్ణదేవరాయలుగా, దొరబాబుగా శ్రీకాంత్‌ ఇందులో ద్విపాత్రాభినయం చేశారని, రాయల గెటప్‌లో శ్రీకాంత్‌ చాలా హుందాగా ఉన్నారని చెప్పారు. సాహిత్యంతో పాటు సంగీతం బాగా కుదిరిన చిత్రమిది. ఈ నెల ద్వితీయార్థంలో చిత్రాన్ని విడుదల చేస్తాం' అని అన్నారు. ఈ చిత్రానికి మాటలు: వీరబాబు బాసిన, ఛాయాగ్రహణం: పూర్ణ, ఆర్ట్‌: జె.కె.మూర్తి, ప్రొ.కంట్రోలర్‌: బందరు బాబి, నిర్మాతలు: కిరణ్‌ జక్కంశెట్టి, నానికృష్ణ, కథ, దర్శకత్వం: నాని కృష్ణ.

    English summary
    Mr Narayana Swami, chairman of the Kapunadu,asked Devaraya team to give up his anti-Kapu stance in film. Addressing a media conference in Hyderabad, Narayana Swami and other Kapu leaders warned the Devaraya film unit.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X