సమస్యలను వదిలేసి.. సినిమాలపై ఫోకసా? దాడులు సరికాదు.. నేతలపై కరణ్ ఫైర్
Recommended Video

సంజయ్ లీలా భన్సాలీ దర్శకత్వంలో రూపొందిన పద్మావత్ చిత్రాన్ని వివాదస్పదంగా మార్చడంపై ప్రముఖ దర్శకుడు కరణ్ జోహార్ మండిపడ్డారు. వరల్డ్ ఎకనామిక్ ఫోరం వార్షిక ప్యానెల్ సమావేశంలో మాట్లాడుతూ.. రాజకీయ నేతల తీరుపై నిరసన వ్యక్తం చేశారు.

నేతల తీరు దారుణం..
రాజకీయ నేతల ప్రవర్తన తీరు చాలా దారుణంగా ఉంది. దేశంలో ఉన్న ఆర్థిక, సామాజిక అసమానతలపై దృష్టిపెట్టకుండా రాజకీయ నాయకులు సినిమాలపై ఫోకస్ పెడుతున్నారు అని కరణ్ అన్నారు.

సంస్కృతిని రుద్దుతారా?
ప్రజలపై బలవంతంగా సంస్కృతిని రుద్దలేము. దేశాన్ని అనేక ఆర్థిక సమస్యలు, సామాజిక అంశాలు పట్టి పీడిస్తున్నాయి. వాటిని రాజకీయ నేతలు పట్టించుకోవడం లేదు. కనీసం సమస్యలపై దృష్టి సారించడం లేదు అని కరణ్ ఆవేదన వ్యక్తం చేశారు.

దాడులకు అంతం పలుకాలి
సంస్కృతి పేరుతో వినోద పరిశ్రమపై చేస్తున్న దాడులకు అంతం పలకాల్సిందే. కళలకు హద్దులు, సరిహద్దులు లేవు. ప్రజలపై సంస్కృతిని బలవంతంగా రుద్దలేం అని అన్నారు.

నటీనటులపై ఆంక్షలు పెట్టొద్దు
కళలకు ముఖ్యంగా సినీ నటీనటులకు విదేశీ ముద్ర వేయవద్దు. ఏ నటుడైనా ఏ భాషలోనైనా.. ఎక్కడైనా నటించే హక్కు ఉంది. పాకిస్థానీ నటుల పేరుతో నిషేధం విధించడం తప్పు. వారిపై ఆంక్షలు పెట్టడం సరికాదు అని అన్నారు.


Click it and Unblock the Notifications











