ఐశ్వర్యరాయ్ ఫిల్మ్ ఖరారైంది: రణబీర్, అనుష్క కూడా...
హైదరాబాద్: చాలా కాలంగా సినిమాలకు దూరంగా ఉంటున్న ఐశ్వర్యరాయ్ రీ ఎంట్రీ ఖరారైంది. కరణ్ జోహార్ దర్శకత్వంలో ఆమె మళ్లీ వెండితెర ఎంట్రీ ఇవ్వబతున్నారు. ఈ చిత్రంలో బాలీవుడ్ యంగ్ హీరో రణబీర్ కపూర్, అనుష్క శర్మ కూడా నటించనున్నారు. వచ్చే ఏడాది జూన్ 3న సినిమాను ప్రేక్షకుల ముందుకు తేవడానికి ప్లాన్ చేస్తున్నారు.

ఇక పోతే ఈ సినిమాకు ‘ఏ దిల్ హై ముష్కిల్' అనే టైటిల్ ఖరారు చేసారు. ఈ విషయాన్ని స్వయంగా కరణ్ జోహార్ ఖరారు చేసారు. రిలేషన్ షిప్స్, హార్ట్ బ్రేక్స్, లవ్ తదితర అంశాల చుట్టూ ‘ఏ దిల్ హై ముష్కిల్' కథ తిరుగుతూ ఉంటుందట. మొత్తానికి ఈచిత్రం ఈ తరం యువతను, ఫ్యామిలీ ప్రేక్షకులను ఆకట్టుకునే విధంగా ఉంటుందని అంటున్నారు.
భారీ బడ్జెట్‌తో ఈ చిత్రం తెరకెక్కబోతోంది. లండన్, న్యూయార్క్, పారిస్, ఢిల్లీ లాంటి ప్రదేశాల్లో షూటింగ్ జరుగబోతోంది. చాలా కాలం తర్వాత ఐశ్వర్యరాయ్ మళ్లీ వెండి తెరపై మెరవడానికి సిద్దంగా ఉండటంతో ఆమె ఫ్యాన్స్ చాలా హ్యాపీగా ఉన్నారు. సినిమాకు సంబంధించిన పూర్తి వివరాలు త్వరలో తెలియనున్నాయి.


Click it and Unblock the Notifications











