»   » బాహుబలి: రాజమౌళి-కరణ్ జోహార్ డిస్కషన్ (వీడియో)

బాహుబలి: రాజమౌళి-కరణ్ జోహార్ డిస్కషన్ (వీడియో)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: ఇండియన్ సినీ ప్రేక్షకులంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్న సినిమా ‘బాహుబలి'. గత కొంత కాలంగా ఎక్కడ చూసినా ఈ సినిమా గురించే చర్చ. భారతీయ సినీ చరిత్రలోనే కని వీని ఎరుగని రీతిలో భారీ బడ్జెట్, హాలీవుడ్ సినిమాలను తలపించే గ్రాఫిక్స్, ఒళ్లు గగుర్బొడిచే యాక్షన్ సీన్లు....వెరసి వెండి ఇండియన్ సిల్వర్ స్క్రీన్ మీద ఒక అద్భుత దృశ్య కావ్యం మరో 10 రోజుల్లో విడుదల కాబోతోంది.

తెలుగులో తెరకెక్కుతున్న ఈ చిత్రం బాలీవుడ్లో కూడా భారీగా రిలీజవుతోంది. బాలీవుడ్ ఫిల్మ్ మేకర్ కరణ్ జోహార్‌కు చెందిన ధర్మ ప్రొడక్షన్స్ ఈ చిత్రాన్ని బాలీవుడ్లో విడుదల చేస్తోంది. ఈ నేపథ్యంలో సినిమా ప్రచార కార్యక్రమాల వేగం పెంచారు. సినిమా ప్రమోషన్‌కు అవసరమొచ్చే ఏ చిన్న అవకాశాన్ని కూడా వదలడం లేదు.


Karan Johar and Rajamouli discuss about Baahubali

తాజాగా ఇద్దరూ సినిమా గురించిన విషయాలపై చర్చిస్తూ ఓ వీడియో విడుదల చేసారు. ఇందులో సినిమాకు సంబందించిన పలు ఆసక్తికర విషయాలు చెప్పుకొచ్చారు. ఆ విషయాలపై మీరూ ఓ లక్కేయండి మరి...


English summary
Karan Johar and S. S. Rajamouli come together on Film Companion to discuss their most talked about venture Baahubali and the art of film making.
Please Wait while comments are loading...