»   »  'బాహుబలి' హిందీ ట్రైలర్‌ (వీడియో)

'బాహుబలి' హిందీ ట్రైలర్‌ (వీడియో)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్‌: ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న 'బాహుబలి' సినిమా ట్రైలర్‌ విడుదలై తెలగు వారందరినీ గర్వ పడేలా చేసింది. అదేసమయంలో హిందీలో ప్రముఖ నిర్మాత కరణ్‌జోహర్‌ ఈ ట్రైలర్‌ను ముంబయిలో విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో దర్శకులు రాజమౌళి, అనుష్క, రానా పాల్గొన్నారు. హిందీ వెర్షన్ ట్రైలర్ ని ఇక్కడ చూడండి.

 Karan Johar launched trailer of ‘Baahubali-The Beginning’


ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు


ప్రభాస్‌, రానా, తమన్నా, అనుష్క ప్రధాన పాత్రధారులుగా ఆర్కా మీడియా వర్క్స్‌ పతాకంపై శోభు యార్లగడ్డ, ప్రసాద్‌ దేవినేని నిర్మిస్తున్న ఈ చిత్రానికి కె.రాఘవేంద్రరావు సమర్పకుడు. హిందీలో ఈ చిత్రాన్ని కరణ్‌ జోహార్‌, ఎ.ఎ.ఫిల్మ్స్‌ సంయుక్తంగా విడుదల చేస్తున్నాయి. సినిమా తెలుగు ట్రైలర్‌ను చిత్రబృందం సోమవారం కొన్ని థియేటర్లతో పాటు, ఆన్‌లైన్‌లో కూడా విడుదల చేసింది.


 Karan Johar launched trailer of ‘Baahubali-The Beginning’


హిందీ ట్రైలర్‌ను కరణ్‌ జోహార్‌ ఆధ్వర్యంలో ముంబయిలో నిర్వహించిన ఓ కార్యక్రమంలో ఆవిష్కరించారు. ఇప్పటివరకు ఫస్ట్‌లుక్‌ల రూపంలో విడుదల చేసిన ప్రధాన పాత్రలన్నీ ట్రైలర్‌లో కనిపించాయి. సినిమా నేపథ్య ప్రాంతం 'మహిష్మతి' రాజ్యం పరిచయమైంది. ముంబయిలో జరిగిన ట్రైలర్‌ విడుదల కార్యక్రమంలో రాజమౌళి, ప్రభాస్‌, రానా, అనుష్క, తమన్నా తదితరులు పాల్గొన్నారు.


 Karan Johar launched trailer of ‘Baahubali-The Beginning’


అలాగే నిన్నటి రోజు ఉదయం వినూత్నంగా పలు థియేటర్లలో ఈ చిత్రం ట్రైలర్‌ను ఉచితంగా ప్రదర్శించారు. ఆన్‌లైన్‌లో విడుదలకు ముందే ట్రైలర్‌ను వీక్షించిన అభిమానులు వివిధ సోషల్‌ మీడియా మాధ్యమాల ద్వారా వారి ఆనందాన్ని పంచుకున్నారు. జులై 10న ఈ చిత్రం పేక్షకుల ముందుకు రానుంది.


English summary
The much-awaited trailer of SS Rajamouli‘s “Baahubali-The Beginning”, which is presented in Hindi by filmmaker Karan Johar, was unveiled . The two-minute five second-long trailer, a visual treat for fans, features an ensemble cast including Prabhas, Rana Daggubati, Anushka Shetty and Tamannaah. “Proud to present India’s Biggest Motion Picture!,” Johar tweeted along with the link of the trailer.
Please Wait while comments are loading...