కరణ్ జోహార్ బిగ్ అనౌన్స్‌మెంట్: రజనీ ‘2.0’బాహుబలి మించిపోవడం ఖాయం!
సూపర్ స్టార్లు రజనీకాంత్, అక్షయ్ కుమార్ ప్రధాన పాత్రల్లో భారీ చిత్రాల దర్శకుడు శంకర్ హాలీవుడ్ స్థాయిలో తెరకెక్కిస్తున్న చిత్రం '2.0'. వాస్తవానికి గతేడాదే ఈ చిత్రం విడుదల కావాల్సి ఉన్నా గ్రాఫిక్స్‌కు సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ పనులు ఆలస్యం కావడంతో వాయిదా పడింది. ఇప్పుడు అన్నీ సర్దుకోవడంతో ఈ ఏడాది నవంబర్ 29న ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తెచ్చేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఇండియాలో ఇప్పటి వరకు వచ్చిన సినిమాలన్నింటికంటే హయ్యెస్ట్ బడ్జెట్ మూవీ (దాదాపు రూ. 450 కోట్లు) ఇదే. ఈ నేపథ్యంలో మార్కెటింగ్ స్ట్రాటజీస్ కూడా అదే స్థాయిలో ఉన్నాయి.
కరణ్ జోహార్ బిగ్ అనౌన్స్‌మెంట్
ఈ సినిమాకు సంబంధించి కరణ్ జోహార్ తాజాగా బిగ్ అనౌన్స్‌మెంట్ చేశారు. 2.0 చిత్రాన్ని తాను ప్రజెంట్ చేయబోతున్నానని, ఈ మెగా మూవీ నా బేనర్ సమర్పణలో రిలీజ్ అవుతుందనిచెప్పడానికి ఎంతో గర్వంగా ఉంది అంటూ ట్విట్ చేశారు.
వినాయక చవితికి టీజర్
కాగా... ఈ నెల 13న వినాయక చవితి సందర్భంగా ‘2.0' టీజర్ విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. టీజర్ రిలీజ్ తర్వాత సినిమా ప్రమోషన్లు జోరందుకోనున్నాయి. హిందీ, తెలుగు, తమిళంలో ప్రచార కార్యక్రమాలు హోరెత్తించనున్నారు.

బాహుబలిని మించి పోవడం ఖాయం
ఇండియాలో అతిపెద్ద సినిమా మార్కెట్ బాలీవుడ్. అక్కడి మార్కెట్‌ను కంట్రోల్ చేసే టాప్ నిర్మాతల్లో కరణ్ జోహార్ ఒకరు. గతంలో ఆయన హిందీలో రిలీజ్ చేసి, ప్రమోషన్స్ చేయడం కూడా ‘బాహుబలి' సినిమా భారీ వసూళ్లు సాధించడానికి తోడ్పడింది. ‘2.0' చిత్రంలో రజనీతో పాటు, అక్షయ్ కూడా ఉండటంతో ‘బాహుబలి'ని మించిపోయేలా కరణ్ మార్కెటింగ్ స్ట్రాటజీస్ రచిస్తున్నారట.

భారీ అంచనాలు
2010లో రజనీకాంత్, శంకర్ కాంబినేషన్లో వచ్చిన ‘రోబో' మూవీ భారీ విజయం సాధించింది. దానికి సీక్వెల్‌గా వస్తున్న చిత్రం కావడం, అక్షయ్ కుమార్ విలన్ పాత్ర పోషిస్తుండటంతో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ చిత్రంలో అమీ జాక్సన్ లేడీ రోబో పాత్ర పోషిస్తోంది.


Click it and Unblock the Notifications











