»   » సెక్స్ పార్టీకి పిలిచారు, 26వ ఏటనే వర్జీనిటీ కోల్పోయా: స్టార్ దర్శక నిర్మాత సంచలనం!

సెక్స్ పార్టీకి పిలిచారు, 26వ ఏటనే వర్జీనిటీ కోల్పోయా: స్టార్ దర్శక నిర్మాత సంచలనం!

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: ప్రముఖ బాలీవుడ్ ఫిల్మ్ మేకర్ కరణ్ జోహార్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదనుకుంటా. బాహుబలి సినిమా ముందు వరకు ఆయన కేవలం బాలీవుడ్లో మాత్రమే అందరికీ తెలుసు....ఈ సినిమాకు హిందీలో నిర్మాతగా మారి రిలీజ్ చేసిన తర్వాత కరణ్ జోహార్ గురించి సౌత్ లోనూ అందరికీ తెలిసిపోయింది. కరణ్ జోహార్ సపోర్టు ఉండటం వల్లనే బాహుబలి చిత్రం ఇంత పెద్ద విజయం సాధించింది అని రాజమౌళి పలు సందర్భాల్లో స్వయంగా వెల్లడించారు కూడా.

సినిమాల ద్వారా ఆయన ఎంత పాపులరో.... ఆయన వ్యక్తిగత విషయాలతోనూ పలు సార్లు హెడ్ లైన్స్ లోకి ఎక్కారు. ముఖ్యంగా ఆయన సెక్సువాలిటీ, సెక్స్ ఓరియెంటేషన్ విషయాల్లో ఆయనపై తరచూ ఏదో ఒక వార్త వినిపిస్తూనే ఉంటాయి. ఆయన 'గే' అనే రూమర్స్ కూడా వచ్చాయి. అలా అని ఆయన ఆ వార్తలపై మౌనంగా ఉండలేదు. పలు సందర్భాల్లో ఆయన తన సెక్స్ కు సంబంధించిన అంశాలపై నిర్భయంగా మాట్లాడారు.

తాజాగా కరణ్ జోహార్ మరోసారి సంచలన ప్రకటన చేసారు. 26 ఏళ్ల వయసులోనే తాను వర్జీనిటీని కోల్పోయినట్లు చెప్పుకొచ్చారు. ఆ సమయంలోనే కరణ్ జోహార్ దర్శకత్వంలో వచ్చిన 'కుచ్ కుచ్ హోతా హై' మూవీ భారీ విజయం సాధించింది. ఆ సమయంలో అలా జరుగడం బాగా కలిసొచ్చింది, బాగా ఫేమస్ అయ్యాను అనే విధంగా కరణ్ జోమార్ స్పందించడం గమనార్హం. ప్రస్తుతం కరణ్ జోహార్ వయసు 44 సంవత్సరాలు.

'నేను శృంగారం కోసం ఎంత మాత్రం వెంపర్లాడటం లేదు. ఆ విషయంలో నన్ను ఎవరైనా వెంటాడ దలుచుకుంటే వెంటాడొచ్చు. కానీ నేను అందుకు సిద్దంగా లేను. గతంలో ఓ సారి ఓపెన్ సెక్స్ పార్టీకి పిలిచినా తిరస్కరించాను. వికారమైన వాటిని నేను ఊహించలేను. నేనొక మొద్దు లాంటి వాడిని. ఏం చేయాలి ఎలా చూడాలి అన్నది నాకు తెలియదు. ఒక్కరినే నేను హ్యాండిల్ చేయలను. ఇద్దరు లేదా అంతకంటే ఎక్కువ మందితో నేను ఎలా చేయగలను’ అంటూ కరణ్ జోహార్ చెప్పుకొచ్చారు.

కరణ్ జోహార్ తన సెక్సువాలిటీపై వస్తున్న రూమర్స్ మీద గతంలో ఇలా స్పందించారు.

కరణ్ జోహార్

కరణ్ జోహార్

‘Pansy(స్వలింగ సంపర్కానికి అలవాటు పడిన పురుషుడు) అనే పదం నాకు అస్సలు నచ్చదు. చిన్నతనంలో నా సమస్య ఏమిటో తెలియక సతమతం అయ్యేవాన్ని, ఎన్నో నిద్రలేని రాత్రులు గడిపాను. మిగతా పిల్లలకంటే నేను విభిన్నం(effeminate) అని తెలుసుకున్నాను. ఈ విషయంలో నాకు నా తల్లిదండ్రులు పూర్తి సపోర్టుగా నిలిచారు' అని తెలిపారు.

ఒకప్పుడు బరువు ఎక్కువ

ఒకప్పుడు బరువు ఎక్కువ

ఒకానొక సందర్భంలో నేను 150 కేజీల బరువు పెరిగాను. ఆసమయంలో మా అమ్మ నువ్వు ఈ ప్రపంచంలోనే బెస్ట్ లుకింగ్ చైల్డ్ అని చెప్పేది. నువ్వు కొంచెం బరువు తగ్గితే హిందీ సినిమాల్లో హీరో అవ్వొచ్చు అనే వారు... అని కరణ్ జోహార గుర్తు చేసుకున్నారు.

గర్వంగా..

గర్వంగా..

తన సినిమాల్లో హోమోసెక్సువాలిటీ అంశాన్ని నెగెటివ్ గా చూపించడంపై.... కరణ్ జోహార్ స్పందిస్తూ ఈ అంశాన్ని సినిమాల్లో చర్చించిన మొదటి ఫిల్మ్ మేకర్ ను నేను అని చెప్పుకొచ్చారు. కల్ హో నహో, దోస్తానా.....సినిమాల్లో ఈ అంశాలపై చర్చ ఉంది. తర్వాత చాలా మంది యంగ్స స్టర్స్ నుండి నాకు లెటర్స్ వచ్చాయి. తమ పేరెంట్స్ తమ సెక్సువాలిటీ గురించి ఐడెంటిఫై చేయడానికి ఈ సినిమాలు చాలా దోహదపడ్డాయని రాసారు. ఇపుడు చాలా సినిమాల్లో ఇలాంటి అంశాలు వస్తున్నాయి. నా సినిమాలతో ఇది మొదలైనందుకు గర్వంగా ఉంది అన్నారు.

భయానకమైన సందర్భం

భయానకమైన సందర్భం

తన ఫ్యామిలీ ఒకానొక సమయంలో కష్టకాలం ఎదుర్కొన్న అంశాలను కూడా చెప్పుకొచ్చారు కరణ్. మా నాన్న అప్పట్లో కొన్ని ఫ్లాప్ మూవీల కారణంగా తీవ్రమైన ఆర్థిక ఇబ్బందుల్లో పడ్డారు. ఇంటితో పాటు నగలు కూడా అమ్ముకునే పరిస్థితి వచ్చింది. ఆ సమయంలో నన్ను ఎవరూ లంచ్ పార్టీలకు కూడా పిలిచేవారు కాదు. నా జీవితంలో అదొక భయానకమైన సందర్భం అని చెప్పారు కరణ్ జోహార్.

English summary
In his latest blog, Karan revealed that he lost his virginity when he was 26 and that he got lucky after the stupendous success of his debut film, Kuch Kuch Hota Hai. The 44-year-old filmmaker said that all his insecurities and inferiority complex were washed away thanks to the mega success of his debut film.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu