టాప్ దర్శకుడిని చంపేస్తామని బెదిరింపులు
ముంబై: ప్రముఖ బాలీవుడ్ దర్శకుడు, నిర్మాత కరణ్ జోహార్‌కు గుర్తు తెలియని వ్యక్తుల నుంచి బెదిరింపులు వచ్చాయి. చంపేస్తామని బెదిరిస్తూ ఆయన మొబైల్ ఫోన్‌కు ఎస్ఎంఎస్‌లు వచ్చినట్లు తెలుస్తోంది. ఈ దీంతో ఆయనకు భద్రత కల్పించడం కోసం ఆయుధాలతో కూడిన పోలీసులను నియమించారు.
కరణ్ జోహార్‌కు బెదిరింపు ఎస్ఎంఎస్ పంపిన వారు ఇంటర్నెట్ ఫోన్ స్వర్వీస్ ద్వారా ఈ చర్యకు పాల్పడ్డారు. దీంతో ఈ బెదిరింపులకు పాల్పడింది ఎవరు అనేది తెలుసుకోవడానికి పోలీసులు నానా తంటాలు పడుతున్నారు. కరణ్ జోహార్‌కు మాత్రమే కాదు, ప్రముఖ బాలీవుడ్ నిర్మాత బోనీ కపూర్‌కు బెదిరింపు కాల్స్ వచ్చాయి.

తనకు బెదిరింపు కాల్స్ రావడంతో బోనీ కపూర్ ముంబైలోని ఓషివరా పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసారు. ఈ విషయాన్ని పోలీసులు కూడా కన్‌ఫర్మ్ చేసారు. బోనీ కపూర్‌ను చంపేస్తామని బెదిరింపు కాల్స్ వచ్చిన మాట నిజమే కానీ, బెదిరించిన వారు ఎలాంటి డిమాండ్లు చేయలేదని పోలీసులు వెల్లడించారు.
గతంలో బోనీ కపూర్ ఇంట్లో జరిగిన ఓ చోరీ ఘటనలో ఇద్దరు వ్యక్తులు అరెస్టు అయ్యారు. వారు రివేంజ్ తీర్చుకోవడానికి ఇలాంటి బెదిరింపులకు పాల్పడి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. ప్రస్తుతం రెండు కేసులపై పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు.


Click it and Unblock the Notifications











