»   »  'బాహుబలి' తో అప్ సెట్ అయిన కరుణ్ జోహార్ తల్లి

'బాహుబలి' తో అప్ సెట్ అయిన కరుణ్ జోహార్ తల్లి

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్‌: భాషా భేధం లేకుండా అంతటా ఇప్పుడు 'బాహుబలి' ట్రైలర్ గురించే చర్చలు జరుగుతన్నాయి. ఈ చిత్రాన్ని హిందీలో కరుణ్ జోహార్ సమర్పించి రిలీజ్ చేస్తున్నారు. ఈ నేపధ్యంలో కరణ్ జోహార్ తల్లి ఈ చిత్రం ట్రైలర్ చూడటం జరిగింది. ఆమె ఈ ట్రైలర్ చూసి అప్ సెట్ అయ్యారని బాలీవుడ్ టాక్. దానికి కారణం...ఆమె ఇప్పటివరకూ ఈ చిత్రాన్ని తన కుమారుడు కరుణ్ రూపొందించారని భావిస్తున్నారట.

ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు


తన వద్ద తన కుమారుడు ఈ చిత్రం డైరక్ట్ చేస్తున్న విషయం దాచారారని ఆమె అనుకున్నారట. కానీ ట్రైలర్ చూసాక..రాజమౌళి దర్శకుడు అని తెలుసుకుని ఆశ్చర్యపోయి...తర్వాత నిజం తెలుసుకుని నిట్టూర్చారట. తన కుమారుడు సమర్పకుడే కానీ డైరక్టర్ కాదనే విషయాన్ని ఆమె డైజస్ట్ చేసుకోవటానికి సమయం పట్టిందిట.


ఇక మరో ప్రక్క 'బాహుబలి' గురించి తెలుగు చిత్ర పరిశ్రమలో ప్రశంసలు వర్షం కురుస్తోంది. తాజాగా .. 'బాహుబలి' కోసం సగటు ప్రేక్షకుడిగా ఎదురుచూస్తున్నా అంటూ చెప్పుకొచ్చారు వెంకటేష్‌. ఆయన మాట్లాడుతూ... ఇటీవల విడుదలైన బాహుబలి ట్రైలర్‌ చూసి తాను ముగ్దుడయ్యానని, సినిమా కోసం సగటు ప్రేక్షకుడిగా ఆసక్తిగా ఎదురు చూస్తున్నానని సినీ నటుడు వెంకటేష్‌ అన్నారు.


 Karan Johar’s mother upset with Baahubali

చిత్రం ట్రైలర్ విషయానికి వస్తే...


నేనొవరో తెలియని కళ్ళు కూడా నన్ను దేవుడిలా చూస్తున్నాయి. ఇంతకీ ఎవరు నేను అని ప్రభాస్ అడిగే డైలాగుతో ఈ చిత్రం ట్రైలర్ విడుదలైంది. భారతీయ చిత్ర పరిశ్రమలో అత్యంత భారీ వ్యయంతో రూపొందుతున్న చిత్రం 'బాహుబలి'. రెండు భాగాలుగా తెరకెక్కుతున్న ఈ సినిమా తొలి భాగం 'బాహుబలి - ది బిగినింగ్‌' పేరుతో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.


ఈ చిత్రంలో ప్రభాస్‌ హీరోగా నటించారు. అనుష్క, తమన్నాహీరోయిన్స్. రానా విలన్ గా కనిపిస్తారు. ఎస్‌.ఎస్‌.రాజమౌళి దర్శకుడు. శోభు యార్లగడ్డ, ప్రసాద్‌ దేవినేని నిర్మిస్తున్నారు. కె.రాఘవేంద్రరావు సమర్పకులు. కీరవాణి సంగీతం అందించారు.

English summary
Bollywood director Karan Johar mother recently watched trailer of Baahubali and she got literally upset and the reason is quite strange. She thought that her son had made Baahubali and never told her about the film.
Please Wait while comments are loading...