twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    హాకీ లెజెండ్ ధ్యాన్‌చంద్‌ జీవితంపై సినిమా

    By Bojja Kumar
    |

    ముంబై: వెండి తెరపై మరో ప్రముఖ క్రీడాకారుడి జీవితం తెరకెక్కబోతోంది. హాకీ లెజెండ్ ధ్యాన్‌చంద్‌ జీవిత కథ ఆధారంగా ఒక చలనచిత్రాన్ని ప్లాన్ చేస్తున్నారు. ధ్యాన్‌ చంద్‌ జీవిత చరిత్రపై సినిమా రూపొందించడానికి నిర్ణయించినట్లు బాలీవుడ్‌ నిర్మాత కరణ్‌ జోహార్‌ వెల్లడించారు.

    హాకీ క్రీడలో లెజెండ్‌గా ప్రసిద్ధి చెందిన ధ్యాన్‌చంద్‌ 1928, 1932, 1936 సంవత్సరాల్లో ఒలింపిక్‌ క్రీడల్లో భారత హాకీ జట్టు స్వర్ణపతకాలు సాధించడంలో కీలక పాత్ర పోషించారు. గొప్ప క్రీడాకారుడిగా పేరుగాంచిన ధ్యాన్‌చంద్‌ జీవిత కథను తన స్నేహితులు పూజ, ఆర్తి శెట్టిలతో పంచుకుంటున్నందుకు సంతోషంగా ఉందని కరణ్‌ ట్వీట్‌ చేశారు. గొప్ప క్రీడాకారుడి జీవితాన్ని సినిమాగా మలిచే అవకాశం వచ్చినందుకు కరణ్‌ ఆనందం వ్యక్తం చేశారు. ధర్మ ప్రొడక్షన్స్ బేనర్లో ఈ చిత్రం తెరకెక్కనుంది.

    Karan Johar's next is biopic on Hockey legend Dhyan Chand

    క్రీడాకారుల జీవిత కథ ఆధారంగా ఇటీవల బాలీవుడ్లో తెరకెక్కిన సినిమాలకు మంచి స్పందన వస్తోంది. మిల్ఖా సింగ్ జీవితం ఆధారంగా తెరకెక్కిన ‘భాగ్ మిల్ఖా భాగ్' చిత్రం భారీ వసూళ్లు సాధించింది. దీంతో పాటు మహిళా భాక్సర్ మేకీకోమ్ జీవితం ఆధారంగా తెరకెక్కిన సినిమాకు కూడా మంచి స్పందన వచ్చింది.

    English summary
    Buzz is that Karan Johar’s production house is all geared up to come a reel adaptation of real life sports legend, hockey star Dhyan Chand.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X