మాసిన గెడ్డంతో వెళితే ఓట్లు పడుతాయా? పవన్ మాలాంటోళ్లను నమ్మడు.. దర్శకుడి వివాదాస్పద వ్యాఖ్యలు
ఆపరేషన్ దుర్యోధన తర్వాత అలాంటి పొలిటికల్ బ్యాక్ డ్రాప్‌తో వచ్చిన చిత్రం ఆపరేషన్ 2019. ఈ చిత్రంలో శ్రీకాంత్ మరోసారి రాజకీయ నాయకుడి పాత్రను పోషించాడు. 2.0 మూవీ ప్రభంజనాన్ని లెక్క చేయకుండా విడుదలైన చిత్రంపై మిశ్రమ స్పందన వ్యక్తమవుతున్నది. అయితే ఈ సినిమాలో పవన్ కల్యాణ్‌ను టార్గెట్ చేసుకొంటూ రాసిన డైలాగ్స్ వివాదంగా మారాయి. తాజాగా నిర్వహించిన సక్సెస్ మీట్‌లో ఈ వివాదంపై దర్శకుడు కరణం బాబ్జీ వివరణ ఇచ్చారు. అసలు డైలాగ్ వివాదం ఏమిటంటే..

ఆపరేషన్ 2019 మంచి రెస్పాన్స్
సక్సెస్ మీట్‌లో దర్శకుడు కరణం బాబ్జీ మాట్లాడుతూ.. ఆపరేషన్ 2019 మూవీకి డివైడ్ టాక్ వచ్చింది. కానీ పొలిటికల్ బ్యాక్ డ్రాప్‌తో వచ్చిన సినిమాను ప్రేక్షకులు ఆదరిస్తున్నారు. ప్రతీ ఒక్కరు సినిమాను చూసి ప్రశంసలు కురిపిస్తున్నారు అని అన్నారు.

నెగిటివ్ ప్రచారం వద్దని
ఎన్నికల వాతావరణం సందర్భంగా పాజిటివ్ టాక్‌ను ఆపరేషన్ 2019 మూవీ సొంతం చేసుకొన్నది. అలాంటి సినిమాపై ప్రతికూలంగా ప్రచారం చేయవద్దు. సినిమాను సినిమాగానే చూడండి. రాజకీయాలను ఆపాదించవద్దు అని మీడియాను కరణం బాబ్జీ కోరారు.

రజనీ మానియాను లెక్కచేయకుండా
సూపర్‌స్టార్ రజనీకాంత్, సెన్సేషనల్ డైరెక్టర్ శంకర్ మానియాను లెక్క చేయకుండా ఆపరేషన్ 2019 విజయం సాధించింది. హీరో శ్రీకాంత్ నటనకు ప్రేక్షకుల బ్రహ్మరథం పడుతున్నారు. ఈ సినిమాపై రోజు రోజుకు బజ్ పెరుగుతున్నది అని కరణం బాబ్జీ పేర్కొన్నారు.

పవన్ కల్యాణ్‌పై సెటైర్లు
ఆపరేషన్ 2019లోని మాసిన గడ్డంతో వెళితే ఓట్లు పడవు అనే డైలాగ్ పవన్ కల్యాణ్‌ను ఉద్దేశించి రాసిన కాదు. ఆ సన్నివేశంతో పవన్ టార్గెట్ చేయడం నా ఉద్దేశం కాదు. సినిమాలో సన్నివేశానికి అనుకూలంగా రాసిన డైలాగ్ మాత్రమే అని కరణం బాబ్జీ వెల్లడించారు.

మమ్మల్ని నమ్మరని
దేశ భవిష్యత్తు యువత చేతుల్లోనే కాదు. ఓటరు చేతూల్లో ఉందనే పాయింట్ ప్రేక్షకులను ఆకట్టుకొంటున్నది. ఈ పాయింట్‌తో రూపొందిన సినిమాలో పవన్ నటించి ఉంటే బాగుండేది. తనలాంటి కొత్త దర్శకులను పవన్ కల్యాణ్ లాంటి టాప్ హీరోలు నమ్మరు అని కరణం బాబ్జీ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.


Click it and Unblock the Notifications