రూ 4 కోట్లు మోసం చేసింది వాడే.. కుమ్మేద్దాం.. జయలలితకు అండగా కరాటే కళ్యాణి
నాటి సీనియర్ నటి జయలలిత కన్నీరు పెట్టుకోవడం, ఆమెకు జరిగిన మోసం గురించి అలీతో సరదాగా షోలో చెప్పుకోవడంతో అది బాగా వైరల్ అయింది. దాదాపు అన్ని వెబ్ సైట్లలో ఆ వార్త ప్రధానంగా కనిపించింది. అయితే సినీ ఇండస్ట్రీలో ఇలాంటి మోసాలు చేయడం, మోసపోవడం సర్వసాధారణంగా జరుగుతుంటాయి. అయితే జయలలిత కథ ఇప్పుడు అందరికీ తెలియడం, ఇలా బయటకు రావడంతో మరోసారి చర్చలోకి వచ్చింది.

అక్కడా ఇక్కడా..
వెండితెరపై ఐటెం సాంగ్స్, వ్యాంప్ పాత్రలు పోషించిన జయలలిత.. బుల్లితెరపై మాత్రం పెద్ద మనిషి తరహా పాత్రలనే పోషించింది. వెండితెరపై ఎంత డిమాండ్ ఉన్న నటిగా ఎదిగిందో.. బుల్లితెరపైనా అంతే స్టార్డంను సంపాదించుకుంది. అయితే బుల్లితెరపై సంపాదించిందంతా కూడా అక్కడే పోగొట్టుకున్నట్టు కనిపిస్తోంది.

తాజాగా అలా..
జయలలిత తాజాగా ఓ షోలో పాల్గొంది. అందులో తనకు జరిగిన అన్యాయం, మోసపోయిన తీరు గురించి చెబుతూ ఎమోషనల్ అయింది. బుల్లితెరపై ఓ నిర్మాత ఎలా మోసం చేశాడో చెబుతూ కన్నీరు పెట్టేసుకుంది. అది చూసి చాలా మంది సోషల్ మీడియాలో ఎమోషనల్ అయ్యారు.

అలా మోసం..
బుల్లితెరపై సీరియల్స్ చేస్తోన్న సమయంలో మోసపోయానని జయలలిత చెప్పుకొచ్చింది. జీఎస్టీ చెల్లించాలి.. సీరియల్స్ తీయడం కష్టమవుతోందని అన్నారు.. అప్పుడు నా డబ్బులు వాడుకోండి.. షేర్ లాంటివి ఏమీ ఇవ్వాల్సిన పనిలేదు అని చెప్పాను. అలా తీసుకుంటూ ఇస్తూ.. 2018 డిసెంబర్ నాటికి నా దగ్గర నాలుగు కోట్లు తీసుకున్నారు.. ఆ తరువాత చేతులెత్తేసి వెళ్లిపోయాడు అంటూ తాను మోసపోయిన తీరు గురించి చెప్పుకొచ్చింది.

కారు కూడా లేదు..
ఇప్పుడు నేను క్యాబ్‌లో తిరుగుతున్నాను. కారు లేదు.. ఒకప్పుడు ఎన్నో కార్లు వాడానో.. ఇంత నమ్మి ఎలా మోసపోయాను.. నా మీద నాకే అసహ్యం వేస్తోంది..అంటూ జయలలిత కన్నీరు పెట్టేసుకుంది. అయితే తాజాగా ఈ ఘటనపై కరాటే కళ్యాణి స్పందించింది.

కరాటే కళ్యాణి పోస్ట్..
జయక్క నువ్వూ ఎంత బాధ ఉన్నా.నవ్వుతూనే ఉంటావు అలాగే సిరిమల్లె లాగానే ఉండాలి..అమ్మ ఇలా ఏడిస్తే మేము యేమైపోతము.. వాడు ఆ అనిల్ రాజు వాడి ఫ్యామిలీ దొరుకుతారు.. మనము కుమ్మెద్దాము... నీకు.కష్టాలు తొందరలో. పోవాలని కోరుకుంటున్నా శ్రీరామ రక్ష. ఇంకెప్పుడు.ఏడవకు నేను చూడలేను అంటూ ఎమోషనల్ అయింది. కరాటే కళ్యాణి పోస్ట్‌పై జయలలిత స్పందిస్తూ.. థ్యాంక్యూ తల్లీ ఎమోషనల్‌లో అలా అయిపోయా అని చెప్పుకొచ్చింది.


Click it and Unblock the Notifications











