పేకాటలో నిర్మాతతో గొడవ.. తంతే గోడకు అతుక్కున్నాడు..: కరాటే కళ్యాణి షాకింగ్ కామెంట్స్

క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కరాటే కళ్యాణి తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు అందుకుంది. చేసేవి చిన్న పాత్రలే అయినా కూడా స్క్రీన్ పై కనిపించినంత సేపు తన నటనతో బాగానే ఆకట్టుకుంటుంది. ఇక ఆమె అప్పుడప్పుడు ఇండస్ట్రీలో కొన్ని కాంట్రవర్సీ గోడవల వల్ల కూడా వార్తల్లో నిలుస్తూ వస్తోంది. అదే విధంగా కొన్ని మంచి పనులు కూడా చేస్తున్నారు. ఇక ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో కళ్యాణి ఒక నిర్మాతతో జరిగిన గొడవపై స్పందించింది.

 కరాటేలో బ్లాక్ బెల్ట్

కరాటేలో బ్లాక్ బెల్ట్

కరాటే కళ్యాణి చిన్నప్పటి కూడా మార్షల్ ఆర్ట్స్ పై మక్కువతో కరాటే గట్టిగానే నేర్చుకుంది. నేషనల్ లెవెల్స్ వరకు కూడా వెళ్లిన ఆమె కరాటేలో బ్లాక్ బెల్ట్ కూడా. ఎవరైనా తప్పు లేకుండా తిడితే ఏ మాత్రం ఆలోచించకుండా తనదైన శైలిలో కౌంటర్ ఇవ్వడానికి రెడీ అవుతుందట. చాలా ఇంటర్వ్యూలలో ఆ విషయాలను ఓపెన్ గానే చెప్పేసింది.

నాగార్జున ఆగ్రహం

నాగార్జున ఆగ్రహం


ఆ మధ్య బిగ్ బాస్ లో కూడా హడావుడి చేసిన విషయం తెలిసిందే. కానీ అందులో ఎక్కువ రోజులు ఉండలేకపోయింది. చిన్న విషయాలకే గొడవలు చేయడంతో విమర్శలు చాలానే వచ్చాయి. ఇక నాగార్జున కూడా ఆమెపై ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఇక హౌజ్ నుంచి బయటకు వచ్చిన అనంతరం కళ్యాణి బిగ్ బాస్ పై ఆగ్రహం కూడా వ్యక్తం చేసింది.

 పావలా శ్యామల కష్టాలను..

పావలా శ్యామల కష్టాలను..


ఆమె బిగ్ బాస్ అనంతరం మొదటిసారి చాలా ఇంటర్వ్యూలలో పాల్గొన్నారు. ఇక బీజేపీ పార్టీలో అప్పుడు హడావిడి కూడా బాగానే చేశారు. పొలిటికల్ గా కూడా అడుగులు వేయబోతున్నట్లు చెప్పింది. ఇక రీసెంట్ గా సీనియర్ బర్టిస్ట్ పావలా శ్యామల కష్టాల్లో ఉన్నట్లు విడియా ద్వారా అందరికి తెలిసేలా చేసింది.

పేకాట ఆడాను..

పేకాట ఆడాను..

ఇండస్ట్రీలో ఎన్నో ఏళ్ల నుంచి కొనసాగుతున్న కరాటే కళ్యాణి మధ్యలో పేకాట కూడా ఆడినట్లు ఒక ఇంటర్వ్యూలో వివరణ ఇచ్చింది. అప్పుడు తెలియక జూబ్లీహిల్స్ లోని క్లబ్ లలో బాగా పేకాట ఆడే దాన్ని. అయితే తప్పని తెలిసిన తరువాత మళ్ళీ దాని జోలికి వెళ్లలేదు అని వివరణ ఇచ్చింది.

Recommended Video

Actor Nani's Golden Heart | సార్.. క్షమించండి అంటూ..!!
 నిర్మాతను తంతే..

నిర్మాతను తంతే..

ఇక ఒకనొక సమయంలో ఒక నిర్మాత వచ్చి అసభ్యంగా మాట్లాడడంతో అలానే పేకాట క్లబ్ లో అందరూ చూస్తుండగా కొట్టినట్లు తెలిపారు. అతను పేరున్న నిర్మాతనే. పేరు చెబితే బావుండదని చెప్పట్లేదు. చాలా అవమానకరమైన మాటలు అనడంతో ఎగిరి ఒక్కటే తన్ను తన్నాను. దెబ్బకు వెళ్లి గోడకు అతుక్కున్నాడు అని కరాటే కళ్యాణి వివరణ ఇచ్చింది.ఆ విధంగా రెండు మూడుసార్లు పెద్దపెద్ద వాళ్ళతోనే గొడవలు అయినట్లు వివరణ ఇచ్చారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X