జబర్దస్త్ వర్షను హేమ అమ్మేయాలనుకుందా?.. తెలుగు నటి సంచలన వ్యాఖ్యలు

బెంగుళూరు రేవ్ పార్టీ కేసులో నటి హేమ ఇరుక్కున్న విషయం తెల్సిందే. తెలుగులో కమెడియన్ గా , సపోర్టింగ్ రోల్స్ లో ఆమె మంచి సినిమాల్లో నటించి మెప్పించింది. హేమకు వివాదాలు కొత్తేం కాదు. మా ఎలక్షన్స్ సమయంలో ఆమె చేసిన కొన్ని వ్యాఖ్యలు ఇండస్ట్రీని షేక్ చేశాయి.

ఇలా చిన్నా చితకా వివాదాలు తప్ప పెద్ద కేసుల్లో హేమ ఎప్పుడు ఇరుక్కున్నది లేదు. ఇక బెంగుళూరు రేవ్ పార్టీలో హేమ అడ్డంగా బుక్ అయ్యింది. పార్టీలో దొరికినా కూడా అది ఒప్పుకోకుండా తాను తన ఫామ్ హౌస్ లో ఉన్నానని, ఎంజాయ్ చేస్తున్నానని తెలిపింది. పోలీసులు తప్పుడు కథనాలను ప్రచారం చేస్తున్నట్లు చెప్పుకొచ్చింది.

Karate Kalyani Controversial Statement On Hema And Jabardasth Varsha Over Rave Party

అంతేకాకుండా తాను బెంగుళూరు లో లేను అని తెలిపే విధంగా ఒక కుకింగ్ వీడియోను కూడా పోస్ట్ చేసింది. హేమ కేసు గురించి ఇండస్ట్రీలో పెద్దలు ఒక్క మాట కూడా మాట్లాడలేదు. నిన్ననే మా ప్రెసిడెంట్ మంచి విష్ణు.. హేమకు సపోర్ట్ గా నిలిచాడు.

" నటి హేమ రేవ్ పార్టీలో పాల్గొన్నారని మీడియా సంస్థలు, వ్యక్తులు నిరాధార ఆరోపణలు చేస్తున్నారు. నేరం ప్రూవ్ అయ్యే వరకు హేమను నిరపరాధిగా పరిగణించాలి. ఎలాంటి అధికారిక సమాచారం లేకుండా ఆమెపై ఆరోపణలు చేయడం సరికాదు. ఆమె ఒక భార్య, తల్లి కూడాను. నిరాధార ఆరోపణలు ఆమె గౌరవానికి భంగం కలిగిస్తాయి.

Karate Kalyani Controversial Statement On Hema And Jabardasth Varsha Over Rave Party

మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ ఎలాంటి చట్ట వ్యతిరేక కార్యకలాపాలను ప్రోత్సహించదు. ఒక వేళ పోలీసుల సమాచారం ఆధారంగా ఆమె తప్పు చేశారని తెలిస్తే అప్పుడు మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ చర్యలు తీసుకుంటుంది" అంటూ చెప్పుకొచ్చాడు.

ఇక హేమ కు వ్యతిరేకంగా మాట్లాడిన ఏకైక వ్యక్తి నటి కరాటే కళ్యాణి. మొదటి నుంచి కూడా ఆమె హేమ తప్పు చేసిందని, ఆమె అలాంటిదేనని, హేమ ఇండస్ట్రీ పరువు తీసిందని చెప్పుకొచ్చింది. ఇక తాజాగా ఆమె హేమపై కరాటే కళ్యాణి మరోసారి విరుచుకుపడింది. ఈసారి హేమ అమ్మాయిలను సరఫరా చేస్తుంది అంటూ సంచలన వ్యాఖ్యలు చేసింది.

జబర్దస్త్ వర్ష ను అమ్మడానికి రేటు మాట్లడినిదని తెలిపింది. " ఆమె దగ్గర కొంతమంది అమ్మాయిలు ఉంటారు. వాళ్ల ఫొటోలను గ్రూప్‌లలో షేర్ చేస్తుంటుంది. దానికి నేనే సాక్ష్యం. గతంలో ఒకసారి మా వాట్సాప్ గ్రూప్ లో జబర్దస్త్ వర్ష ఫోటోను హేమ సెండ్ చేసింది. ఈ గ్రూప్ లో ఆమె ఫోటో ఎందుకు పంపించిందో అర్దం కాలేదు. వెంటనే ఆ ఫోటోను డిలీట్ చేసి.. వేరే గ్రూప్ లో పెట్టబోయి ఈ గ్రూపు లో పెట్టినట్లు తెలిపింది.

Karate Kalyani Controversial Statement On Hema And Jabardasth Varsha Over Rave Party

హేమ చాలా తప్పులు చేసింది. అసలు వర్ష తో ఆమెకు ఏం పని..? ఆమె ఫోటోను వాట్సాప్ గ్రూప్ లోకి ఎందుకు వచ్చింది.. ? ఇవన్నీ కనుక్కోండి..అప్పుడే మాకు చాలా అనుమానాలు వచ్చాయి. ఇప్పుడు హేమ ఈ డ్రగ్స్ కేసు నుంచి తప్పించుకోలేదు. ఎందుకంటే ఇది చిన్న కేసు కాదు.. ఇప్పటికైనా హేమ తప్పు చేసినట్లు ఒప్పుకోవడం లేదు.. ఆమె ఇక మారదు" అని చెప్పుకొచ్చింది. ప్రస్తుతం కరాటే కళ్యాణి వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారాయి. మరి ఈ వ్యాఖ్యలపై హేమ ఎలా స్పందిస్తుందో చూడాలి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X