twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    పట్టు వదలని కరాటే కళ్యాణి.. 20 యూట్యూబ్ ఛానెల్స్ పై పోలీసులకు ఫిర్యాదు!

    |

    కొద్ది రోజుల క్రితం నటి కరాటే కళ్యాణి యూట్యూబర్ శ్రీకాంత్ రెడ్డి మీద దాడి చేసిన సంగతి అందరికీ గుర్తుండే ఉంటుంది. ఈ వివాదంతో ఒక్కసారిగా కరాటే కళ్యాణి అనూహ్యంగా వార్తల్లోకెక్కింది. ఈ వివాదం తర్వాత ఆమె ఏకంగా పిల్లలను కిడ్నాప్ చేసి అమ్ముతుంది అంటూ కూడా ఆరోపణలు వెల్లువెత్తాయి. అయితే అదేమీ నిజం కాదని ఆమె ఆధారాలతో సహా నిరూపించారు కూడా.

    అయితే ఈ విషయంలో వెనక్కి తగ్గేది లేదంటున్న కరాటే కళ్యాణి ఇప్పుడు అసభ్యకర ఫ్రాంక్ వీడియోలు చేస్తున్న యూట్యూబ్ ఛానల్స్ మీద పోలీసులకు ఫిర్యాదు చేసింది. సుమారు 20 యూట్యూబ్ చానల్స్ మీద కరాటే కల్యాణి సాక్ష్యాలతో సహా సెంట్రల్ క్రైమ్ స్టేషన్ పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది. ఆమె ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు 67A, 509 సెక్షన్ల కింద కేసు దర్యాప్తు మొదలు పెట్టినట్లు సమాచారం.

    నిజానికి కరాటే కళ్యాణి వివాదం ప్రారంభం కావడానికి రెండు రోజులు ముందు ఈ అసభ్యకర యూట్యూబ్ చానల్స్ మీద కేసులు నమోదయ్యాయి. దీంతో ఇప్పటికే పోలీసులు యూట్యూబ్ ఛానల్స్ మీద నిఘా పెట్టడంతో పాటు ఒక ప్రత్యేక బృందాన్ని కూడా ఏర్పాటు చేశారు. ఇప్పుడు అదే విషయం మీద మరొకరు కూడా ఫిర్యాదు చేయడంతో సదరు యూట్యూబ్ చానల్స్ కు పోలీసులు నోటిసులు జారీ చేయడానికి సిద్ధం అయినట్లు తెలుస్తోంది.

    Karate Kalyani files cases against 20 YouTube channels

    మరోపక్క కరాటే కళ్యాణి తనను చంపడానికి కూడా ప్రయత్నిస్తోంది అంటూ యూట్యూబర్ శ్రీకాంత్ రెడ్డి ఆరోపణలు గుప్పించారు. ఆ తర్వాత కరాటే కళ్యాణి మీద అక్రమ దత్తత ఆరోపణలు రావడంతో శ్రీకాంత్ రెడ్డి సైలెంట్ అయ్యారు. ఆ సమయంలో కరాటే కళ్యాణి కూడా రెండు రోజుల పాటు ఎవరికీ కనిపించకుండా పోవడంతో ఆమె మీద అనేక ఆరోపణలు వెల్లువెత్తాయి.

    చివరికి తాను దత్తత తీసుకున్నాను అంటూ ఆరోపణలు ఎదుర్కొన్న పాప తల్లిదండ్రులతో కలిసి ప్రెస్ మీట్ నిర్వహించారు. అక్రమ దత్తత లాంటిది ఏమీ లేదని నిరూపించడమే కాక దత్తత వయసు కూడా రాక పోవడంతో వారి తల్లిదండ్రులను కూడా తానే సాకుతున్నాను అని చెప్పుకొచ్చారు. అంతేకాక శివశక్తి అనే ఒక సంస్థ తన మీద కక్ష కట్టిందని వాళ్లే తన మీద ఫిర్యాదులు చేస్తున్నారని వాళ్ల ప్లాన్ లో భాగంగానే తన మీద ఆరోపణలు వచ్చాయని కరాటే కళ్యాణి పేర్కొన్నారు. ఒకప్పుడు సినిమాల్లో వరుస అవకాశాలు దక్కించుకున్న ఆమెకు తర్వాత నెమ్మదిగా అవకాశాలు తగ్గిపోయాయి.

    బిగ్ బాస్ లో అవకాశం రావడంతో ఆమె బిగ్ బాస్ కి కూడా వెళ్లారు. అయితే ఆమెకు పెద్దగా సపోర్ట్ లేకపోవడంతో మొదట్లోనే ఎలిమినేట్ అయ్యి బయటకు వచ్చారు. బయటకు వచ్చిన తర్వాత బీజేపీ తీర్థం పుచ్చుకున్న ఆమె బిజెపి హిందూత్వ వాదం తలకెత్తుకుని హిందువుల మీద ఎవరైనా కామెంట్ చేస్తున్నా, దాడులు చేస్తున్న తానున్నానంటూ వారికి అండగా నిలబడే ప్రయత్నం చేస్తోంది.

    English summary
    Tollywood character artist Karate Kalyani on Friday complained to CCS against 20 YouTube channels over obscene prank videos.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X