Karate Kalyani: నన్ను చంపేందుకు ప్లాన్ చేస్తున్నారు.. ఖమ్మంలోనే అలా: కరాటే కల్యాణి కామెంట్స్
సినీ నటి, బిగ్ బాస్ తెలుగు నాలుగో సీజన్ ఫేమ్ కరాటే కల్యాణి గురించి తెలుగు ప్రేక్షకులకు పరిచయం అవసరం లేదు. ఎన్నో సినిమాలు, సీరియళ్లలో నటించి అలరించారు. 120కిపైగా సినిమాల్లో నటించిన కరాటే కల్యాణి ఛత్రపతి, కృష్ణ, మిరపకాయ్ వంటి చిత్రాలతో తెలుగు రాష్ట్రాల్లో చాలా బాగా పాపులర్ అయ్యారు. అయితే కరాటే కల్యాణి ఇటీవల ఏం మాట్లాడిన వివాదం కావడం, ఆమెను నెటిజన్లు ట్రోల్ చేయడం సాధారణంగా జరుగుతూ వస్తూనే ఉంది. కానీ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో కల్యాణి చేసిన వ్యాఖ్యలు షాకింగ్ కు గురి చేశాయి.
హరికథ కళాకారిణిగా:హా బాబీ.., అబ్బా.. పిండేసారు.. అంటూ డైలాగ్స్ తో తెలుగు రాష్ట్రాల్లో మంచి పాపులారిటీ తెచ్చుకున్నారు నటి కరాటే కల్యాణి. ఇలా ఎన్నో సినిమాలతో పేరు తెచ్చుకున్న కరాటే కల్యాణి హరికథ కళాకారిణి కూడా. కరాటేలో బ్లాక్ బెల్ట్ సాధించిన ఆమె సుధీర్ఘకాలం పాటు హరికథ చెప్పినందుకు లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్ లోకి సైతం ఎక్కారు.

నోటి దురుసుతో:కరాటే కల్యాణి సినిమాల్లోనే కాకుండా బుల్లితెరపై కూడా సందడి చేసింది. మాటే మంత్రము, మధుమాసం వంటి సీరియళ్లలో అలరించారు. అంతేకాకుండా అత్యంత ప్రేక్షకాదరణ పొందిన బిగ్ బాస్ లోని ఆమె పాల్గొంది. నాలుగో సీజన్ లో కంటెస్టెంట్ గా అడుగు పెట్టిన కరాటే కల్యాణి ఆమె నోటి దురుసు కారణంగా అతి తొందర్లోనే బయటకు వచ్చేశారు.

కాంట్రవర్సీ మాటలతో:సోషల్ మీడియాలో ఎక్కువగా యాక్టివ్ గా ఉండే కరాటే కల్యాణి ఏదో ఒక విషయంపై కాంట్రవర్సీగా మాట్లాడుతూ వార్తల్లో నిలుస్తుంటారు. ఇటీవలే స్వర్గీయ ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాల సందర్భంగా శ్రీకృష్ణుని రూపంలో ఉన్న ఎన్టీఆర్ విగ్రహాన్ని మే 28న ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. కానీ దీనిపై ఎన్టీఆర్ విగ్రహం ఏర్పాటు చేసుకోండి. అంతేకానీ శ్రీకృష్ణుని రూపంలోని ఎన్టీఆర్ విగ్రహం పెట్టడానికి వీల్లేదని కామెంట్స్ చేశారు.

దాడులకు ప్రయత్నించారు:శ్రీకృష్ణుని ఎన్టీఆర్ విగ్రహంపై న్యాయ పోరాటం కూడా చేసింది. దీంతో విగ్రహం ఏర్పాటుపై హైకోర్టు స్టే విధించింది. అప్పటి నుంచి కల్యాణి పేరు వార్తల్లో నిలవగా.. తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆమెను చంపేందుకు ప్లాన్ చేస్తున్నట్లుగా వ్యాఖ్యలు చేశారు. తనకు ప్రాణ హాని ఉందని, దాడులకు ప్రయత్నించారని తెలిపారు.

హైవేపై వెళ్తుంటే:"నాకు ప్రాణ హానీ ఉంది. ఈ మధ్యనే నా కారు రెండు టైర్లను గుర్తు తెలియని వ్యక్తులు కోసేశారు. ఈ మధ్య హిందుత్వ వాదులతో కలిసి కారులో వెళ్తున్నాను. ఒక గుడి దగ్గర ఏదో గొడవ జరుగుతుంటే అటునుంచి తిరిగి ఓ డొంక రోడ్ లో వస్తున్నప్పుడు కారు టైర్ పేలిపోయింది. అదే హైవే రోడ్డుపై వెళ్తున్నప్పుడు జరిగితే చాలా పెద్ద ప్రమాదం జరిగేది" అని కరాటే కల్యాణి పేర్కొన్నారు.

అంతా ఖమ్మంలోనే:"ప్రమాదం తర్వాత ఆ కార్ టైర్ చూసిన మెకానిక్ లు ఆ టైర్ ను ఎవరో ముందే కొంచెం కోసేశారని చెప్పారు. నా మీద కోపంతోనే ఎవరో కావాలని అలా చేశారు. ఈ గొడవకు టీడీపీకి సంబంధం లేదు. రాజకీయం అంతా ఖమ్మంలోనే జరుగుతుంది. ఎన్టీఆర్ కు దైవత్వాన్ని ఆపాదించే క్రమంలో కొంతమంది ఆయన విగ్రహాన్ని కృష్ణుని రూపంలో పెడుతున్నారు. కృష్ణుడికి ఒక రూపం ఉంది. ఆయన రూపంలో మనుషుల విగ్రహాలు పెట్టడం సరికాదు" అని కల్యాణి చెప్పుకొచ్చారు.


Click it and Unblock the Notifications











