Vishwak Sen అంటే ఎవరికీ తెలియదు.. 15 నెలలుగా అలా.. తండ్రి కరాటే రాజు ఎమోషనల్ గా!
విభిన్నమైన చిత్రాలు చేసుకుంటూ ముందుకు సాగుతున్నాడు విశ్వక్ సేన్. ఫలక్ నుమా దాస్ చిత్రంతో డైరెక్టర్ గా మారి మాస్ హీరో అనిపించుకున్నాడు. హీరోగా నటిస్తూనే మరోవైపు దర్శకుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. తాజాగా మరోసారి స్వీయ దర్శకత్వంలో విశ్వక్ సేన్ నుంచి వస్తున్న కొత్త చిత్రం 'దాస్ కా ధమ్కీ'. వన్మయే క్రియేషన్స్, విశ్వక్ సేన్ సినిమాస్ బ్యానర్లపై కరాటే రాజు (విశ్వక్ సేన్ తండ్రి) నిర్మిస్తున్నారు. ఫలక్ నుమా దాస్ మూవీకి నిర్మాతగా వ్యవహరించిన కరాటే రాజు తాజాగా నిర్మించిన చిత్రమే 'దాస్ కా ధమ్కీ'. ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ ఫంక్షన్ లో విశ్వక్ సేన్ గురించి మాట్లాడారు.
మాస్ హీరో విశ్వక్ సేన్ తండ్రి కరాటే రాజు తాజాగా నిర్మించిన చిత్రం దాస్ కా ధమ్కీ. ఉగాది పండుగ సందర్భంగా మార్చి 22న తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో పాన్ ఇండియా మూవీగా విడుదల కానుంది. ప్రమోషన్స్ లో భాగంగా శుక్రవారం ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా నిర్మాత కరాటే రాజు ఎమోషనల్ గా వ్యాఖ్యలు చేశారు.

"ఎన్టీఆర్ కుటుంబంలో విషాదం జరిగిన మా అబ్బాయికి ఫంక్షన్ కు వస్తానని మాట ఇచ్చి వచ్చారు. ఎలాంటి దిగులు పెట్టుకోకూడదని చెప్పి ఎన్టీఆర్ సపోర్ట్ గా నిలవడం ఎంతో సంతోషంగా ఉంది. ఇప్పుడు మా సినిమా గురించి మాట్లాడతా. ఫస్ట్ ఫలక్ నుమా దాస్ తీశాం. అప్పుడు విశ్వక్ సేన్ అంటే ఎవరికీ తెలియదు. సినిమాను ఎలాగైనా నిలబెట్టాలన్న ఉద్దేశంతో ప్రమోషన్స్ చేశాడు. సినిమా రిలీజ్ కాకముందే స్టార్ డమ్ తెచ్చుకున్నాడు మా అబ్బాయి" అని కరాటే రాజు అన్నారు.
"ఇప్పుడు ఈ సినిమాకు మా అబ్బాయి 15 నెలలుగా చాలా కష్టపడుతున్నాడు. అన్నీ తానై కథను అనుకూలంగా, ఈ జనరేషన్ ఏ విధంగా కావాలో అందుకు తగినట్లుగా మలిచాడు. సినిమా అద్భుతంగా వచ్చింది. నేను ఒక వాస్తు కన్సల్టెంట్. ఎనర్జీ హీలర్. ఒక స్థలానికి నాలుగు మూలలు, దిక్కులు కలిపితే ఎలాంటి ఎనర్జీ ఉంటుందో అదే విధంగా నవరసాలు, అష్టదిక్పాలకులకు ఎలాంటి ఎనర్జీ ఉంటుందో అది తీసుకురావడం జరిగింది. ఈ సినిమా ఫైనాన్షియల్ గా కూడా సక్సెస్ అవుతుంది. ఆస్కార్ అవార్డ్ తీసుకొచ్చి మనందరికి పేరు తెచ్చిన ఎన్టీఆర్ గారు సపోర్ట్ చేయండ చాలా సంతోషంగా ఉంది" అని నిర్మాత, విశ్వక్ సేన్ తండ్రి కరాటే రాజు తెలిపారు.


Click it and Unblock the Notifications











