మధుర్ న్యూ 'హీరోయిన్’ను సాక్షాత్తు నేనే..!?
ఎట్టకేలకు మధుర్ భండార్కర్‌కు 'హీరోయిన్" దొరికింది. ఐశ్వర్యరాయ్ తల్లి కాబోతుందనే వార్త విన్నప్పటినుంచి షాక్ లో ఉన్న మధుర్ తన తాజా ప్రాజెక్టు' హీరోయిన్"ను అటకెక్కించిన అంతా అనుకున్నారు. కొన్నాళ్లు ప్రియాంకచోప్రా, టబు లు నటిస్తారనే పుకార్లు కూడా వినిపించాయి. అయితే ఎట్టకేలకు 'హీరోయిన్"గా కరీనా కపూర్ కనిపించనుంది. ఈ విషయాన్ని సాక్షాత్తు కరీనానే వెల్లడించడం విశేషం.
'మధుర్ స్క్రిప్టు చదివిన తర్వాత నేను ఆ పాత్రను చేసేందుకు సిద్ధమేనని చెప్పాను. ఇప్పుడిక నా డేట్స్ ఇవ్వడం... రెమ్యునరేషన్ మాట్లాడుకోవడమే మిగిలింది" అని కరీనా మీడియాకు వివరించింది. ఇటీవలే షారుక్ 'రా వన్" షూటింగ్ ముగించుకున్న కరీనా ప్రస్తుతం సల్మాన్ సరసన నటించిన 'బాడీగార్డ్" విడుదల కోసం ఆసక్తిగా ఎదురుచూస్తోంది. త్వరలోనే కరీనా మైనపు బొమ్మ కూడా ప్రసిద్ధ మేడమ్ టస్సడ్ మ్యూజియంలో కొలువుదీరనుంది. అయితే ఈ బొమ్మ 'చమేలీ" టైపులో ఉంటుందనే వార్తలకు ఆమె సమాధానమిస్తూ 'అలాంటిదేం లేదు... ఆ బొమ్మ మీ అందర్నీ ఆశ్చర్యానికి గురిచేస్తుందని మాత్రం చెప్పగలను" అంటూ సర్ ప్రైజ్ లుక్ ఇచ్చిందీ జీరో సైజ్ భామ.


Click it and Unblock the Notifications











