మన హీరోయిన్ కి యూకే పార్లమెంట్ విందు
ఇక బాలీవుడ్ హాట్ హీరోయిన్ కరీనా కపూర్ గతంలో జీరో సైజు బాడీతో సెక్సీగా తయారై అభిమానుల మతి పోగొట్టిన సంగతి తెలిసిందే. ఈ సారి కరీనా మరో అడుగు ముందుకేసి సిక్స్ ప్యాక్ కండలతో కనిపించబోతోంది. 'శుద్ధి' పేరుతో రూపొందబోతున్న బాలీవుడ్ చిత్రంలో కరీనా సిక్స్ ప్యాక్ బాడీతో కనిపించనుందట. కరణ్ మల్హోత్రా దర్శకత్వం వహిస్తున్న ఈచిత్రంలో హృతిక్ రోషన్ హీరోగా చేస్తున్నారు. ఈ చిత్రంలో సిక్స్ ప్యాక్ బాడీతో కనిపించడం కోసం కరీనా కపూర్ చాలా స్ట్రిక్ట్‌గా డైట్ మెయింటేన్ చేయబోతోందట. ఫిట్ నెస్ ట్రైనర్ ఆధ్వర్యంలో ప్రతి రోజూ వర్కౌట్లు చేస్తూ ఆరు పలకల బాడీ కోసం కసర్తుతులు చేస్తోందట.
అలాగే గమ్యం' 'వేదం', 'కృష్ణమ్ వందే జగద్గురుమ్' తదితర సినిమాల్ని తెరకెక్కించిన తెలుగు దర్శకుడు క్రిష్ హిందీలోకి అడుగుపెడుతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో అక్షయ్ కుమార్ హీరో. దాంతో అక్షయ్ తో కరీనా కపూర్ జత కట్టబోతోంది. చిత్రం టైటిల్ 'గబ్బర్'. తమిళంలో వచ్చిన 'రమణ' (తెలుగులో ఠాగూర్) ఆధారంగా హిందీలో ఈ చిత్రం రూపొందబోతోంది. తెలుగులో జ్యోతిక చేసిన ప్లాష్ బ్యాక్ పాత్ర అది.
'ఇందులో అక్షయ్ కుమార్‌కి భార్యగా కరీనా కనిపించబోతోంది. 'కంబఖ్త్ ఇష్క్' తర్వాత వీరిద్దరూ కలిసి చేయబోతున్న సినిమా ఇదే. ఈ చిత్రంలో మరో హీరోయిన్ కూ చోటుంది. ఆ పాత్రకు అషిమా భల్లా పేరును పరిశీలిస్తున్నట్లు తెలిసింది. తమిళంలో ఎ.ఆర్.మురుగదాస్ రూపొందించిన 'రమణ' కథ అవినీతిపై ఓ యుద్ధంలా సాగింది. ఈ కథను క్రిష్ బాలీవుడ్ ప్రేక్షకుల ముందుకు ఎలా తీసుకెళతారనేది వేచి చూడాల్సిందే. ప్రస్తుతం పూర్వనిర్మాణ పనులు సాగుతున్నాయి. త్వరలోనే హీరోయిన్స్ ని, పూర్తి వివరాల్ని ప్రకటిస్తారు.


Click it and Unblock the Notifications












