For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  జూ ఎన్టీఆర్‌తో పాటు కరీనా కపూర్

  By Bojja Kumar
  |
  ముంబై : యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ 'మలబ్బార్ గోల్డ్ అండ్ డైమంట్స్' సంస్థకు ప్రచారం చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ కంపెనీకి ప్రచారం చేసే స్టార్ల జాబితాలో ఇప్పుడు బాలీవుడ్ సెక్సీ హీరోయిన్ కరీనా కపూర్ కూడా చేరారు. ఈ మేరకు ఆ సంస్థ కరీనాతో కోట్ల రూపాయలు చెల్లించి ఒప్పందం కుదుర్చుకున్నట్లు తెలుస్తోంది.

  మలబ్బార్ గ్రూఫు చైర్మన్ అహ్మద్ మాట్లాడుతూ...'బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కరీనా కపూర్‌ తమ సంస్థ ఉత్పత్తులకు ప్రచారం చేయనుంది. నార్త్ ఇండియా మార్కెట్‌కు తమ సంస్థ తరుపున బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరించనున్నారు. ఆమె స్టార్ ఇమేజ్ తమ ఉత్పత్తుల అమ్మకానికి తోడ్పతుందనే నమ్మకం ఉంది' అని వెల్లడించారు.

  కరీనా కపూర్ మాట్లాడుతూ...మలబ్బార్ గోల్డ్ డిజైన్స్ మగువల అందాలకు మరింత శోభ తెచ్చి పెడతాయని, ఎంతో నమ్మకమైన సంస్థ అని, నార్త్ ఇండియాలో ఈ సంస్థ త్వరలో మరిన్ని షోరూమ్స్ ఏర్పాటు చేయబోతున్నారని, ఎన్నో వేల రకాల డిజైన్స్ ఇందులో లభ్యమవుతాయని తెలిపారు.

  గతంలో మలబ్బార్ గోల్డ్ అండ్ డైమండ్స్ కంపెనీకి ఐశ్వర్యరాయ్ ప్రచారం చేసారు. అయితే ఇప్పుడు ఐశ్వర్యరాయ్ సినిమాలకు దూరం కావడంతో ఆమె స్థానంలో కరీనాకపూర్‌ను బ్రాండ్ అంబాసిడర్‌గా నియమించుకున్నారు.

  English summary
  After Aishwarya Rai Bachchan, actress Kareena Kapoor has become the brand ambassador of a jewellery retail chain. As per the reports, Bebo has been signed up as the ambassador of jewellery retail chain Malabar Gold & Diamonds.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X