హీరోయిన్లు ముద్దెట్టుకున్నారంటూ మసిపూసారు(ఫోటో)
హైదరాబాద్: ఏదైనా విషయాన్ని మసిపూసి మారేడు కాయ చందంగా చేయడం మీడియా వారికి తెలిసినంతగా మరెవరికీ తెలియదేమో. అలా అని అన్నీ మీడియా సంస్థలు అలాంటివే అని కాదు. కొన్ని మాత్రం అలా చేస్తుంటాయనడానికి తాజాగా జరిగిన ఓ సంగటనే నిదర్శనం.
ఇటీవల అమెరికాలో జరిగిన ఇండియన్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ లో బాలీవుడ్ స్టార్ హీరోయిన్స్ కరీనా కపూర్, బిపాసా బసు నోట్లో నోరు పెట్టుకుని ముద్దు పెట్టుకున్నారంటూ...ఓ ఫోటో చూపిస్తూ మరీ కొన్ని మీడియా సంస్థలు వార్తలు అల్లాయి.

అయితే అక్కడ జరిగింది వేరని, అసలు వాళ్లు నోట్లో నోరు పెట్టి లిప్ లాక్ ముద్దు పోట్టుకోలేదని స్వయంగా చూసిన వారు అంటున్నారు. వేడుకలో ఇద్దరూ ఒకరికొకరు ఎదురు కావడంతో మర్యాద పూర్వంగా ఇచ్చుకునే 'పెక్' ఇచ్చుకున్నారు.
పెక్ అంటే....ఒకరి బుగ్గులు ఒకరు రాసుకుంటూ మర్యాద పూర్వకంగా చేసుకునే ఆలింగనం. అయితే ఫోటో గ్రాఫర్ల జిమ్మిక్కుతో ఆ ఫోటోలను ఇద్దరూ ముద్దు పెట్టుకున్నట్లు క్రియేట్ చేసారు. అందుకు సంబంధించిన స్పష్టమైన సాక్ష్యం ఇక్కడ చూడొచ్చు.


Click it and Unblock the Notifications











