»   » ఈ హాట్ బ్యూటీ చిల్లులు పడ్డ జిమ్ టీషర్టు ఖరీదు రూ. 45 వేలు!

ఈ హాట్ బ్యూటీ చిల్లులు పడ్డ జిమ్ టీషర్టు ఖరీదు రూ. 45 వేలు!

Posted By:
Subscribe to Filmibeat Telugu
Kareena Wears Cotliest Shirt For Gym Purpose

సినీతారలు నలుగురిలో ఒకరిలా కాకుండా.... నలుగురిలో ప్రత్యేకంగా కనిపించడానికి ఆరాటపడుతుంటారు. అందుకే అందం, డ్రెస్సింగ్ విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటారు. ముఖ్యంగా హీరోయిన్లు ఇందు కోసం ఎంత ఖర్చు పెట్టడానికైనా వెనకాడరు. కోట్లలో సంపాదించే వారు.... అధిక మొత్తం వారి మెయింటనెన్స్ కోసం వెచ్చిస్తుంటారు.

ఫిట్‌నెస్ విషయంలో ప్రత్యేక శ్రద్ధ చూపే బాలీవుడ్ హీరోయిన్ కరీనా కపూర్... తాజాగా జిమ్ చేసేందుకు వేసుకున్న టీషర్టు హాట్ టాపిక్ అయింది. ప్రపంచ ప్రఖ్యాత బ్రాండ్ గుస్సి బ్రాండ్‌కు చెందిన డిజైనర్ టీషర్టు ఇది.

Kareena Kapooor gym T-shirt cost $720

వాష్డ్ కాటన్‌తో రూపొందిన ఈ టీషర్టుపై అక్కడక్కడా చిల్లులు పెట్టి రూపొందించారు. చెమటలు కక్కుతూ జిమ్ చేస్తన్న సమయంలో ఈ చిల్లుల ద్వారా చల్లనిగాలి వెళ్లి హాయిగా అనిపిస్తుందట. కరీనా ధరించి ఈ టీషర్టు ఖరీదు గురించి ఇంటర్నెట్లో సెర్చ్ చేసిన అభిమానులు... దాని ధర $720 (దాదాపు రూ. 45 వేల పైనే) ఉండటం చూసి షాకయ్యారు.

కాగా.. కుమారుడికి జన్మనిచ్చిన తర్వాత కొంత గ్యాప్ తీసుకున్న కరీనా కపూర్ మళ్లీ బాడీని ఫిట్‌గా చేసుకుని తన తర్వాతి సినిమాకు సిద్ధమవుతోంది. ప్రస్తుతం ఆమె శశాంక్ ఘోష్ దర్శకత్వంలో 'వీరే ది వెడ్డింగ్' అనే చిత్రంలో నటిస్తోంది.

English summary
Kareena was recently spotted coming out of her fitness centre in a pair of black legging and a relaxed-fit Gucci tie-dye AC/DC T-shirt, made in washed cotton jersey with small holes in the fabric for a worn-in feel. The cost of the T-shirt was $720.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

X