‘హీరోయిన్’ రెమ్యూనరేషన్ లీక్ చేసిన దర్శకుడు
ఆయన ఓ ప్రముఖ ఆంగ్ల దినపత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ 'మే గతంలో చాందినీ బార్ చిత్రాన్ని రూ. 1.5 కోట్ల బడ్జెట్ తో రూపొందించా....కానీ ఇప్పడు 'హీరోయిన్' చిత్రంలో కరీనా కపూర్ రూ. 1.5 కోట్లు చార్జ్ చేస్తోందని వ్యాఖ్యానించారు.
ఇంతకు ముందు పేజ్ -3 ద్వారా సెలబ్రిటీ ల జీవితాల్లో చీకటి కోణాలను, ట్రాఫిక్ సిగ్నల్ , కార్పొరేట్ వంటి సినిమా ల ద్వారా సమాజంలో భిన్న వర్గాల జీవన శైలిని ప్రత్యేకించి వాస్తవంలో వాటి తీరును మధుర్ బాగా చిత్రీకరించాడని పేరు వచ్చింది. తాజాగా మరోసారి సినిమా జీవితాలను గురించి వివరిస్తానంటూ 'హీరోయిన్' సినిమా రూపొందించాడు మధుర్.
మొన్న మధ్య ఆయన రూపొందించిన 'ఫ్యాషన్' సినిమా మోడళ్ల జీవితాల గురించి పరిచయంచేసింది. ఆ సినిమాతో ప్రియాంక చోప్రా జాతీయ అవార్డు గెలుచుకొంది. ఇక తాజా 'హీరోయిన్' సినిమా విషయంలో మొదట హీరోయిన్ గా ఐశ్వర్య రాయ్ ను అనుకొన్నా...ఆమె ప్రెగ్నెన్సీ తో కరీనా 'హీరోయిన్' అయ్యింది. అర్జున్ రామ్ పాల్ ఇందులో మేల్ లీడ్ రోల్ చేస్తున్నాడు.


Click it and Unblock the Notifications












