For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    22 గంటలు ఏకధాటిగా పాల్గొన్న సెక్సీలేడీ

    By Bojja Kumar
    |

    మామూలుగా మనం 8 గంటలు లేదా 10 గంటలు పని చేస్తాం. మహా అయితే 12 గంటలు. కానీ బాలీవుడ్ సెక్సీ హీరోయిన కరీనా కపూర్ ఏకంగా 22 గంటలు పాటు శ్రమించి అందరినీ ఆశ్యర్య పరిచింది. సైఫ్ అలీఖాన్ స్వీయనిర్మాణలో తెరకెక్కిస్తున్న 'ఏజెంట్ వినోద్"లో ఈ జీరో సైజ్ సుందరి చేసిన సాహసం ఇప్పుడు బాలీవుడ్ సినీ వర్గాల్లో చర్చనీయాంశం అయింది. ఐటమ్ సాంగ్స్ రాజ్యమేలుతున్న బాలీవుడ్‌లో సాంప్రదాయ రీతిలో సాగే ముజ్రా నృత్యాన్ని ఈ చిత్రంలో పెట్టారు దర్శకుడు. సరోజ్‌ఖాన్ నృత్యదర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ పాటను కరీనాపై ఏకధాటిగా 22 గంటల పాటు చిత్రీకరించారట. ఇందులో ఎక్కువ సమయం ఆమె మెకాళ్లపై నర్తించాల్సి వచ్చిందట. దీంతో పాట పూర్తయ్యే సరికి కరీనా మెకాళ్లు నేలకు ఒరుసుపోయి కందిపోయాయట.

    ఈ విషయమై కరీనా స్పందిస్తూ..గ్యులర్ పాటల్లో ఎలాగైనా నర్తించవచ్చు. కానీ ఇలాంటి సంప్రదాయ నృత్యాల్ని అంకితభావంతో చేయాలి. శారీరకంగా కూడా శ్రమించాలి. నాకు శాస్త్రీయ నృత్యాల్లో ప్రవేశం లేకపోయినా దాదాపు 22 గంటల పాటు శ్రమకోర్చి ఈ పాటను పూర్తిచేయడం ఆనందంగా వుంది..ఇక గాయం సంగతంటారా...బెస్ట్ అవుట్‌పుట్ రావాలంటే ఇలాంటి వాటికి ఓర్చుకోవాలి" అని వ్యాఖ్యానించింది. వృత్తిపరంగా అంకితభావంతో పనిచేసే హీరోయిన్ గా మొదటి నుంచి కరీనాకు ఓ మంచి పేరుంది. ఒక్కసారి ఏదైనా సినిమాకు కమిట్ అయితే చిత్రీకరణ పూర్తవడం మొదలుకొని ప్రచార కార్యక్షికమాల్లో విధిగా పాల్గొంటుంది. తాజా సాహసంతో దర్శక నిర్మాతల వద్ద మరిన్ని మంచి మార్కులు కొట్టేసింది కరీనా.

    English summary
    Bollywood star Kareena Kapoor in a continuous stretch of 22 hours, taking part in the filming of the song.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X