కరీనా అందాలను సెక్సీగా చూపించిన ‘చీర’ వేలానికి...
ముంబై: షారుక్ ఖాన్, కరీనా కపూర్ జంటగా రూపొందిన 'రా.వన్' చిత్రంలో చమ్మక్ చల్లో సాంగ్ ఎంత పాపులర్ అయిందో కొత్తగా చెప్పాల్సిన పని లేదు. ముఖ్యంగా ఈ పాటలో కరీనా అందాలు అదుర్స్. కరీనా ఈ సాంగులో ఎరుపు చీర ధరించి ఎంతో సెక్సీగా కనిపించి ప్రేక్షకుల మతులు పోగొట్టింది.
తాజాగా ఈ ఎరుపు చీరను వేలం వేయాలని నిర్ణయించింది కరీనా. ఈ వేలం ద్వారా వచ్చిన సొమ్మును 'న్యూ టైగర్ కంటి ఆసుపత్రి' కోసం వినియోగించనున్నారట. ఫటౌడీ ఫ్యామిలీ ఈ వేలం కార్యక్రమాన్ని లండన్‌లో నిర్వహిస్తున్నారు. భర్త సైఫ్ అలీ ఖాన్‌తో కలిసి ఈ వేలం కార్యక్రమానికి హాజరు కానుంది కరీనా.
ఈ వేలం కార్యక్రమంలో ఇంటర్నేషనల్ ఫుట్ బాల్ ఆటగాడు లియోనల్ మెస్సి సంతకం చేసిన టీ షర్టు, రాహుల్ ద్రావిడ్ సతకం చేసిన క్రికెట్ బ్యాటు, కరీనా కపూర్ రా.వన్ చిత్రంలోని చమ్మక్ చల్లో సాంగులో ధరించిన ఎరుపు సారీ తదితర మరికొన్ని కూడా ఉండనున్నాయని తెలుస్తోంది.
గతంలో పలువురు బాలీవుడ్ సెలబ్రిటీలు తమ ఫేమస్ వస్తువులను వేలం వేసారు. ప్రియాంక చోప్రా తన హీల్స్(చెప్పులు) రూ. 2.5 లక్షలకు వేలం వేసి ఆ డబ్బును యూనిసెఫ్ నిర్వహిస్తున్న 'సేవ్ ది గర్ల్ కాంపెయిన్' కోసం ఇచ్చింది. అక్షయ్ కుమార్ తన ఓమై గాడ్ సినిమాలో ధరించి సూట్ వేలం వేసి ఆ డబ్బును పాఠశాలల కోసం విరాళంగా ఇచ్చారు.


Click it and Unblock the Notifications












