హృదయ విధారకంగా కన్నీళ్ళపర్యంతమై హీరోయిన్..?
గతంలో ఐశ్వర్య రాయ్ చేయాల్సిన చిత్రం, ధర్శకుడు మధుర్ భండార్కర్ డ్రీమ్ ప్రొజెక్ట్ 'హీరోయిన్'. ఐశ్వర్య ఈ పాత్రకు చాలా బాగా సూట్ అవుతుందని, ఆమెను ప్రధాన పాత్రలో చూపించడానికి మధుర్ తహతహలాడాడు. కొద్దిరోజలు షూటింగ్ కూడా జరిగింది. అయితే ఐశ్వర్య రాయ్ ప్రెగ్నెంట్ అన్న విషయంతో ఆ షూటింగ్ కి బ్రేక్ పడింది. ఇప్పుడు ఐశ్వర్య రాయ్ పాత్రకి కరీనాకపూర్ ఎంపిక చేసుకొని.ఈ చిత్రం షూటింగ్ ఈ మధ్యనే మొదలు పెట్టారు.
బాలీవుడ్ లో నెంబర్ వన్ హీరోయిన్ గా రాణిస్తున్న కరీనా కపూర్ ఈమధ్య కంటతడి పెట్టింది... అది కూడా షూటింగులో..! ఆమె హృదయ విధారకంగా కన్నీళ్ళపర్యంతమై ఏడ్చేస్తుంటే సెట్లో వున్న వాళ్లంతా కంగారుపడిపోయారు. చివరికి ఆమెను సముదాయించి, ఊరుకోబెట్టేసరికి దర్శకుడు మాధుర్ బండార్కర్ కి తల ప్రాణం తోకకొచ్చింది. ఇంతకీ... ఆమెకు అంతగా బాధ కలిగించిన విషయం ఏమిటనుకుంటున్నారా... అక్కడికే వస్తున్నాం. కరీనా ప్రధాన పాత్రధారిగా మాధుర్ బండార్కర్ 'హీరోయిన్' పేరుతో తాజాగా ఓ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు.
ఒక సినిమా నటి జీవితంలో చోటుచేసుకునే కష్టసుఖాలను చర్చిస్తూ ఈ చిత్రాన్ని వాస్తవానికి దగ్గరగా రూపొందిస్తున్నాడు మాధుర్. హీరోయిన్ అవ్వాలనుకునే అమ్మాయిల పట్ల సినిమా రంగం ప్రదర్శించే చులకన భావంతో బాటు, వారిపై జరిగే లైంగిక వేధింపులని కూడా ఇందులో దర్శకుడు చూపిస్తున్నాడు. ఇటీవల దీనికి సంబంధించిన ఓ విషాద సన్నివేశాన్ని చిత్రీకరిస్తుండగా ఆ పాత్రలో లీనమైపోయిన కరీనా, షాట్ ఓకే అయ్యాక దుఖాన్ని ఆపుకోలేక ఏడ్చేసిందట. అంతలా ఆమెను ఆ సన్నివేశం కదిలించింది. కరీనా బాలీవుడ్ లోని పేరున్న కపూర్ కుటుంబానికి చెందిన అమ్మాయి కాబట్టి, ఆమె ఇలాంటి కష్టాలు పడకుండానే స్టార్ ఇమేజ్ తెచ్చుకుంది. కానీ, ఎంతో మంది అమ్మాయిలు పడరాని పాట్లు పడుతున్నారన్న విషయం తెలిసి, ఆమె షూటింగులో తన భావోద్వేగాలను కంట్రోల్ చేసుకోలేకపోయిందట!


Click it and Unblock the Notifications











