10 కోట్లు తీసుకోలేదు, నన్ను మాత్రమే ఇరికించొద్దు: కరీనా
'హీరోయిన్' సినిమా కోసం కరీనాకు రూ. 10 కోట్ల రెమ్యునరేషన్ చెల్లించారని, భారత దేశ సినీ చరిత్రలో ఇప్పటి వరకు కథానాయికకు చెల్లించిన పెద్ద మొత్తం ఇదేనని ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో కరీనా కపూర్ స్పందించింది.
'పదికోట్ల రెమ్యునరేషన్ నేనెప్పుడూ డిమాండ్ చేయలేదు. ఈ మధ్య నేను నటించిన సినిమా కలెక్షన్లు వందకోట్లను దాటుతున్నాయని చెబుతున్నారు. ఆ క్రెడిట్ నా ఒక్కదానిదే కాదు, అందరి కృషితోనే సాధ్యమైంది. నన్ను మాత్రమే విజయంలో ఇరికించొద్దు' అని చెప్పకొచ్చింది.
నేను నటించడం వల్లనే సినిమాకు కలెక్షన్లు పెరుగుతున్నాయనే వాదనను కూడా కరీనా కొట్టి పారేసింది. కరీనా నటించిన త్రీ ఇడియట్స్, బాడీగార్డ్ , రా.వన్ చిత్రాలు వందకోట్ల కలెక్షన్లు దాటడంతో ఈ భామను బాలీవుడ్ నిర్మాతలంతా గోల్డెన్ హీరోయిన్ గా భావిస్తున్నారు.
కరీనా నటించిన 'హీరోయిన్', ఏంజెంట్ వినోద్ సినిమాలు విడుదల కావాల్సి ఉందిని. ఈ సినిమాలు కూడా భారీ విజయం సాధించిందంటే....కరీనా భవిష్యత్ భవిష్యత్ బంగారుమయం కాదు, వజ్రాల మయం అవడం ఖాయం అంటున్నారు విశ్లేషకులు.


Click it and Unblock the Notifications











