twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ‘ఈస్ట్రన్ ఐ’ సర్వేలో మోస్ట్ సెక్సీయస్ట్ ఉమన్ ‘కరీనా కపూర్’...!

    By Sindhu
    |

    బాలీవుడ్‌ శృంగార నాయికలు ఎవరని అడిగితే అంతా టకటకా కత్రినా, కరీనా, దీపిక పదుకునె, ప్రియాంకాచోప్రా అంటూ భారీ లిస్ట్‌ చదివేస్తారు. అయితే గడచిన రెండు సంవత్సరాలుగా ఆసియా ఖండంలోనే అత్యంత శృంగార తారగా తన హవా కొనసాగిస్తున్న కత్రినాకైఫ్‌ కు ఈ సంవత్సరం బ్రేక్‌ పడింది. ఇప్పుడు ఆమె స్థానాన్ని కరీనాకపూర్‌ కైవసం చేసుకుంది. 'ఈస్ట్రన్‌ ఐ" అనే బ్రిటీష్‌ మేగజైన్‌ కండెక్ట్‌ చేసిన ఓ సర్వేలో 'సెక్సీయెస్ట్‌ ఏషియన్‌ వుమెన్‌-2011"గా కరీనాకపూర్‌ ఎంపికయింది. అయితే కత్రినాకైఫ్‌ కంటే కొద్దిపాటి తేడాలో మాత్రమే కరీనా ఈ స్థానం కైవసం చేసుకోవడం గమనార్హం. ఈ విషయాన్ని ఈస్ట్రన్‌ ఐ మ్యాగజైన్‌ ఎడిటర్‌ ఆస్జాద్‌ నజీర్‌ ధృవీకరించారు.

    ఈ పోటీలో ఆసియాకు చెందిన అనేకమంది మోడల్స్‌, టివి యాంకర్స్‌, బాలీవుడ్‌ నటీమణులు ఎందరో పాల్గొన్నారని చివరకు విజయం కరీనాను వరించిందన్నారు. గత ఏడాది ఈ స్థానాన్ని దక్కించుకున్న కత్రినాకైఫ్ ఈ ఏడాది రెండవ స్థానంతోనే సరిపెట్టుకోవలసి వచ్చింది. ఇక మూడో స్థానంలో ప్రియాంక చోప్రా నిలిచారు.

    నాల్గవ స్థానాన్ని బిపాసాబసు, ఐదవ స్థానాన్ని ఫ్రీదా పింటో దక్కించుకున్నారు. అరుదైన ఈ గౌరవం దక్కడంతో కరీనాకపూర్ ఆనందానికి అవధులు లేకుండా పోయింది. ''సెక్సీ అనిపించుకోవడం ఒకప్పుడు పెద్ద తప్పుగా భావించే వారు. కానీ ప్రస్తుతం ఆ పరిస్థితి లేదు. చూపులకు సెక్సీగా కనిపించడం అంటే అది మనలో ఆత్మ విశ్వాసాన్ని పెంచే అంశం. నాకు ఈ గౌరవాన్ని ఇచ్చిన 'ఈస్టర్న్ ఐ" పత్రిక వారికి థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను"" అంటూ ఆనందం వ్యక్తం చేశారు కరీనా.

    కాగా ఇటీవల ఈ పోటీకి ముందు కొందరు అడిగిన ప్రశ్నకు సమాధానంగా కరీనా జవాబిస్తూ తనకంటే నెంబర్‌ వన్‌ స్థానం కత్రినాకే బెస్ట్‌ అని ఎందుకంటే తనకు ఈ నెంబర్‌ వన్‌ లమీద ఆసక్తి లేదని ప్రకటించింది. వరుస విజయాలతో దూసుకుపోతున్న కరీనాకు ఈ స్థానం దక్కడం సబబేనని అభిమానులు మురిసిపోతున్నారిప్పుడు.

    English summary
    Kareena Kapoor emerged as the sexiest Asian woman in the world, according to a survey conducted by Eastern Eye. As reported by PTI, Eastern Eye, a weekly, conducted a survey through social networking sites like twitter and Kareena came out on top, leaving behind last year's winner Katrina Kaif.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X