‘హీరోయిన్’ తెరవెనక భాగోతం, పెద్దలకు మాత్రమే!
పైకి అందంగా ఒయ్యారాలు ఒలక బోస్తూ కనిపించే బార్ గర్ల్స్, మోడల్స్ జీవితాలు తెర వెనక ఎలా ఉంటాయి అని తన గత చిత్రాలో కళ్లకు కట్టినట్లు చూపించిన మధుర్...ఈ సారి హీరోయిన్ల జీవితాల్ని 'హీరోయిన్' చిత్రంలో ఆవిష్కరించనున్నారు. ముఖ్యంగా ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా కింది స్థాయి నుంచి వచ్చిన హీరోయిన్ల జీవితం ఎలా ఉంటుంది, వారు ఎదుర్కొన్న పరిస్థితులు ఏమిటి? అనే అంశాన్ని బేస్ చేసుకుని ఈచిత్రాన్ని నిర్మించారు.
రోనీ, మాధుర్ బండార్క్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈచిత్రానికి దాదాపు రూ. 18 కోట్లు ఖర్చు పెట్టారు. సెప్టెంబర్ 21వ తేదీన ఈచిత్రాన్ని భారీగా రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. గతంలో మాధర్ దర్శకత్వంలో వచ్చిన చాందినీ బార్, ఫ్యాషన్, పేజ్ త్రీ, ట్రాఫిక్ సిగ్నల్ చిత్రాలకు మంచి గుర్తింపు వచ్చింది. పైగా కరీనా కపూర్ హీరోయిన్ కావడంతో ఈ చిత్రంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.


Click it and Unblock the Notifications












