షూటింగులో హీరోయిన్ కరీనా కపూర్‌కు గాయాలు
ముంబై : బాలీవుడ్ హీరోయిన్ కరీనా కపూర్ సినిమా షూటింగులో గాయపడింది. ఇమ్రాన్ ఖాన్, కరీనా కపూర్ జంటగా పునీత్ మల్హోత్రా దర్శకత్వంలో రూపొందుతున్న 'గోరి తేరా ప్యార్ మేయిన్' అనే చిత్రం షూటింగులో ఈ ఘటన చోటు చేసుకుంది.
ఈ చిత్రంలో స్టంట్స్ చేస్తుండగా ఈ ఘటన చోటు చేసుకున్నట్ల తెలుస్తోంది. అయితే ఆందోళన పడాల్సిందేమీ లేదని, చిన్న గాయమే అని, వెంటనే కరీనా కపూర్ కోలుకుందని యూనిట్ సభ్యులు తెలిపారు. తమ అభిమాన తార సేఫ్ అని తేలడంతో ఫ్యాన్స్ ఊపిరి పీల్చుకున్నారు.
ఇటీవలే స్టార్ హీరో సైఫ్ అలీ ఖాన్‌ను పెళ్లాడిన కరీనా కపూర్...పెళ్లి తర్వాత కూడా హీరోయిన్‌గా తన కెరీర్ కొనసాగిస్తోంది. పలు సినిమాల్లో ఐటం సాంగులు చేయడంతో పాటు, ఇటు హీరోయిన్‌గానూ రాణిస్తోంది. త్రీఇడియట్స్ చిత్రంలో అమీర్ ఖాన్‌తో రొమాన్స్ చేసిన ఈ సెక్సీ బ్యూటీ ఇప్పుడు అమీర్ అల్లుడు, తనకంటే వయసులో చిన్నవాడైన ఇమ్రాన్ ఖాన్‌తో స్క్రీన్ రొమాన్స్ చేస్తుండటం విశేషం.


Click it and Unblock the Notifications












