కరీనా.. కమల్ ఖాన్ చెంపలు వాయించు.. చీప్ ట్రిక్స్ ఫ్యాన్స్ ఆగ్రహం
బాలీవుడ్ తారలు కంగన రనౌత్, హృతిక్ రోషన్ మధ్య చోటుచేసుకొన్న వివాదంలో రంగోలి చండేల్ చేసిన వ్యాఖ్యలపై సినీ విమర్శకుడు కమల్ ఆర్ ఖాన్ స్పందించిన తీరుపై పలువురు మండిపడుతున్నారు.
బాలీవుడ్ తారలు కంగన రనౌత్, హృతిక్ రోషన్ మధ్య చోటుచేసుకొన్న వివాదంలో రంగోలి చండేల్ చేసిన వ్యాఖ్యలపై సినీ విమర్శకుడు కమల్ ఆర్ ఖాన్ స్పందించిన తీరుపై పలువురు మండిపడుతున్నారు. కంగన సోదరి చండేల్‌ను తిట్టాలనుకొంటే నేరుగా తిట్టవచ్చని.. కానీ కరీన్ కపూర్ ప్రతిష్ఠను దెబ్బతీసే విధంగా కమల్ వ్యవహరించడమేంటని నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వివరాల్లోకి వెళితే..

కమల్ ఆర్ ఖాన్ స్పందన
తన సోదరి కంగన రౌనత్ వెంట హృతిక్ రోషన్ పడ్డారు. తన సోదరి పట్టించుకోకున్నా ప్రేమించమని ఆమెను ప్రాధేయపడ్డారు. అందుకు సాక్షాలిదిగో అంటూ కొన్ని ఫొటోలను కంగన సోదరి రంగోలి బయటపెట్టారు. దానిపై కమల్ ఆర్ ఖాన్ స్పందించారు.

కరీనాతో నాకు అఫైర్
కరీనా కపూర్ నాతో 4 ఏళ్లుగా అఫైర్ నడిపింది. అందుకు సాక్ష్యం ఇదిగో అంటూ కరీనాతో దిగిన ఫొటోను ట్వీట్ చేశారు. అంతేకాకుండా రంగోలి చండేల్ కాదు.. రంగోలి చుడేల్ (దెయ్యం) అని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ఫొటోలు చూపిస్తే ఎవరూ నమ్మరని ఆయన వ్యాఖ్యానించారు.

కమల్ ఖాన్‌పై కరీనా ఫ్యాన్స్ ఆగ్రహం
కరీనా ఫొటోను ఉపయోగించకోవడంపై కమల్ ఖాన్ చేసిన ట్వీట్‌పై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రంగోలిని ఏమైనా విమర్శించాలంటే నేరుగా ఆమెను టార్గెట్ చేసుకోవచ్చు కానీ ఈ వ్యవహారంలో కరీనాను లాగడమెందుకు అని ఫ్యాన్స్ మద్దతుగా నిలిచారు.

వీర్ ది వెడ్డింగ్ షూటింగ్
ఇక కరీనా విషయాన్ని వస్తే ప్రస్తుతం వీర్ ది వెడ్డింగ్ అనే చిత్ర షూటింగ్‌లో కరీనా బిజీగా ఉంది. ఢిల్లీలో జరిగిన షెడ్యూల్‌ను ముగించుకొని ఇటీవలే కరీనా ముంబైకి చేరుకొన్నది. ముంబైలోని తన స్వగృహంలో దీపావళి పండుగ ఏర్పాట్లు చేసుకొంటున్నది.

తైమూర్‌తో తొలి దీపావళి
కరీనా కపూర్‌కు ఈ దీపావళీ ప్రత్యేకమైనది. ఎందుకంటే తన కుమారుడు తైమూర్‌కు ఇది తొలి దీపావళీ పండుగ. తన కుమారుడికి కొత్త అనుభూతులను పంచేందుకు కరీనా ఈ పండుగను భారీగా జరుపుకోవడానికి ప్లాన్ చేసినట్టు సమాచారం.


Click it and Unblock the Notifications











