»   » కరీనా అమ్మతనాన్నీ మార్కెట్ చేసుకుంటోంది.... కడుపులో బిడ్దతోనే కోట్లు సంపాదన

కరీనా అమ్మతనాన్నీ మార్కెట్ చేసుకుంటోంది.... కడుపులో బిడ్దతోనే కోట్లు సంపాదన

Posted By:
Subscribe to Filmibeat Telugu

కెరీర్‌ పీక్‌లో ఉన్నప్పుడు పెళ్లి చేసుకోవడానికే భయపడతారు హీరోయిన్లు. ఒకవేళ పెళ్లి చేసుకుని ప్రెగ్నెంట్‌ అయితే ఇక బయట కనబడనే కనబడరు. డెలివరీ అయిన తర్వాత ఆ బిడ్డ ఫోటో ఒకటి రిలీజ్‌ చేస్తారంతే. అయితే హాలీవుడ్‌ ప్రభావంతో భారతీయ హీరోయిన్లు కూడా ట్రెండ్‌ మార్చేస్తున్నారు. టీవీ రియాల్టీ స్టార్‌ కిమ్‌ కర్దేషియాన్‌ ప్రెగ్నెంట్‌గా ఉండగానే ఫోటో షూట్లలో పాల్గొనడం, యాడ్‌లు చేయడం చేసేది. ఇప్పుడు అదే బాటలో మన బాలీవుడ్ హీరోయిన్ కరీనా కూదా చేరి పోయింది స్టార్‌ కథానాయిక కరీనాకపూర్‌.... ఏళ్ల తరబడి బాలీవుడ్‌లో నటిస్తుంది.

Kareena Kapoor latest endorsements

నటిగా తనేంటో నిరూపించుకుంది. అయినా ఇప్పుడూ నటనపై ఆమెకున్న తాపత్రయం తగ్గలేదు. ఇప్పుడు అని ప్రత్యేకంగా ఎందుకు అనాల్సి వచ్చిందంటే ఆమె ప్రస్తుతం గర్భిణి. ఈ సమయంలో హాయిగా విశ్రాంతి తీసుకోవచ్చు. కానీ ఆమె అలా అనుకోలేదు. సినిమాలకు దూరంగా ఉండటానికి ఇష్టపడలేదు. సినిమా కార్యక్రమాల్లో పాల్గొంటుంది. అన్నిటికంటే ఆసక్తికర విషయం ఏంటంటే ఈ మధ్య ర్యాంప్‌ వాక్‌ కూడా చేసింది.

అందుకే కరీనా గర్భిణిగా ఉండే 9 నెలల్లో ఆమె జీవితంలో జరిగే విషయాలన్నింటితో డాక్యుమెంటరీగా తీయాలనేది ఓ ఆన్‌లైన్‌ పోర్టల్‌ ఆలోచన. తన సినిమాలకు మాతృత్వం అడ్డుకాకూడదని కరీనా భావిస్తోంది. తల్లి కాబోతున్నా సినిమాలను దూరం పెట్టలేదు. గర్భిణిగా కరీనా చేస్తున్న పనులు ఆసక్తి కలిగిస్తున్నాయి. తను గర్భిణి అని ప్రకటించింది మొదలు డిసెంబరులో ఓ బిడ్డకు జన్మనిచ్చే వరకు జరిగే పరిణామాలన్నింటిని డాక్యుమెంటరీగా రూపొందించబోతున్నామని ఆన్‌లైన్‌ పోర్టల్‌ నిర్వాహకులు చెప్పినట్టు సమాచారం.

Kareena Kapoor latest endorsements

ఇక ఇది ఇక్కడితోనే అయిపోతే మనం మాట్లాడుకోవటం ఉందేదికాదు గానీ కరీనా అక్కడితో చాలించకుండా పుట్తక ముందే తన బిడ్డ ని అడ్డుపెట్టుకొని కోట్లు సంపాదిస్తోంది కరీనా కపూర్‌ ఖాన్‌. స్టార్‌ హీరో సైఫ్‌ ఆలీ ఖాన్‌ను పెళ్లి చేసుకున్న కరీనా ఇప్పుడు ప్రెగ్నెంట్‌ అనే విషయం తెలిసిందే. అయినా కరీనా విశ్రాంతి తీసుకోవడం లేదు. ప్రెగ్నెన్సీ వచ్చాకే ఆమె ఎండార్స్‌ చేసే బ్రాండ్ల సంఖ్య పెరిగిందట. ముఖ్యంగా మాతృత్వం గురించిన ప్రొడక్ట్స్‌ను అంగీకరిస్తూ కాసుల పంట పండించేసుకుంటోందట. మరోపక్క ఫోటో సెషన్లతోనూ బిజీగా గడిపేస్తోంది. మొత్తానికి ఏ సందర్భాన్నైనా క్యాష్‌ చేసుకోవడం బాలీవుడ్‌ హీరోయిన్లకు తెలిసినట్టుగా మరెవరికీ తెలియదేమో!

English summary
Kareena Kapoor Khan has been asked by an online clothing fashion brand to endorse its line for pregnant women. She has been approached to be the face for their special collection
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu