»   » నయనతారని ఫాలోఅవుతానంటున్న బాలీవుడ్ హాట్ అండ్ సెక్సీ స్టార్...!

నయనతారని ఫాలోఅవుతానంటున్న బాలీవుడ్ హాట్ అండ్ సెక్సీ స్టార్...!

Posted By:
Subscribe to Filmibeat Telugu

నయనతార ఇప్పుడు చాలా చాలా హ్యాపీగా వుంది. ప్రభుదేవాని త్వరలో పెళ్లి చేసుకుంటున్నందుకు కాదు ... బాలీవుడ్ అగ్ర తార కరీన్ కపూర్ తనని ఎంతగానో అభినందించినందుకు.! ఇంతకీ అసలు విషయం ఏమిటంటే.. మలయాళంలో ఘన విజయం సాధించిన 'బాడీగార్డ్' చిత్రాన్ని ఇప్పుడు హిందీలో రీమేక్ చేస్తున్నారు. ఇందులో సల్మాన్ ఖాన్, కరీనా కపూర్ హీరో హీరోయిన్లుగా నటిస్తున్నారు.

ఈ సందర్భంగా చిత్ర దర్శకుడు సిద్దికీ ఈ సినిమా మలళం ఒరిజనల్ 'బాడీగార్డ్' తో (కథానాయిక నయన్)బాటు, తమిళ రీమేక్ వెర్షన్ అయిన 'కావలన్' (కథానాయిక అశిన్) సినిమాను కూడా చూడమని కరీనాకు రెండు సీడీలిచ్చాడు. దీని వల్ల హీరోయిన్ పాత్ర పట్ల అవగాహనతో బాటు కాస్ట్యుం పరంగా కూడా ఓ ఐడియా తెచ్చుకోవచ్చని డైరెక్టర్ చెప్పాడు. రెండు వెర్షన్లూ చూసిన కరీనాను నయన్ అభినయం, లుక్స్ ఎంతగానో ఆకట్టుకున్నాయట. దాంతో నయన్ నే ఫాలో అవుతానని చెప్పింది. ఈ విషయం విన్న మన మల్లూ బేబీ.. కరీనా అంతటి ఆర్టిస్టు తనని లైక్ చేయడంతో ఆనందంతో ఎగిరిగంతేస్తోందిప్పుడు. అయితే, బాలీవుడ్ లో స్థానం కోసం తీవ్రంగా ట్రై చేస్తున్న అశిన్ కి చురకంటించడానికే కరీనా ఈ వంకన నయన్ ని పొగిడిందని బాలీవుడ్ వర్గాలు అంటున్నాయి.!

English summary
It seems Nayantara's simple looks in Malayalam movie Bodyguard has impressed Kareena Kapoor. The latter, who is portraying the former's role in Bollywood version of Bodyguard, has preferred Nayan's look over Asin Thottumkal's in Kaavalan.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu