పెళ్లి కోసం...40 లక్షల నెక్లెస్ ఆర్డర్ ఇచ్చిన కరీనా
బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కరీనా కపూర్ తన కోస్టార్ సైఫ్ అలీఖాన్‌తో సహ జీవనం చేస్తున్న సంగతి తెలిసిందే. త్వరలో ఇద్దరు పెళ్లి కూడా చేసుకోబోతున్నారు. తాజాగా అందిన సమాచారం ప్రకారం కరీనా తన పెళ్లి వేడుక కోసం రూ. 40 లక్షల విలువ చేసే రాయల్ నక్లెస్‌ను ప్రత్యేకంగా తయారు చేయించుకుంటోందట. రాజ్ కోట్ సంబంధించిన ఆభరణాల నిపుణులు దీన్ని తయారు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇందు కోసం 400 గ్రాముల బంగారం, వజ్రాలు పొదిగి దీన్ని తయారు చేస్తున్నారు. మరో వైపు సైఫ్ కరీనా వేలికి తొడిగేందుకు అరుదైన మేలిమి వజ్రంతో ఖరీదైన ఉంగరాన్ని తయారు చేయిస్తున్నట్లు సమాచారం. మార్చి నెలలో ఈ జంట వివాహం జరిగే అవకాశం ఉంది.
ప్రస్తుతం సైఫ్ - కరీనా జంటగా ఏజెంట్ వినోద్ చిత్రం రూపొందుతోంది. సైఫ్ తన సొంత బ్యానర్ పై ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. మార్చి 23న ఈ చిత్రాన్ని విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. కరీనా కపూర్ ఈ చిత్రంతో పాటు మాధుర్ బండార్కర్ రూపొందిస్తున్న 'హీరోయిన్' చిత్రంలో, అమీర్ ఖాన్ తో కలిసి 'తలాష్' చిత్రంలో, అమీర్ మేనల్లుడు ఇమ్రాన్ ఖాన్ తో కలిసి 'ఏక్ మెయిన్ ఔర్ ఏక్ తు' చిత్రాల్లో నటిస్తోంది.


Click it and Unblock the Notifications











