»   » పాపం.. అందుకే కరీనా కపూర్ ఎప్పుడూ కాలేజీ వెళ్లలేదు

పాపం.. అందుకే కరీనా కపూర్ ఎప్పుడూ కాలేజీ వెళ్లలేదు

Posted By:
Subscribe to Filmibeat Telugu

ముంబై: కరీనా కపూర్... బాలీవుడ్లో అత్యంత ఎక్కువ పారితోషికం తీసుకునే హీరోయిన్. హీరోయిన్‌గా ఇలాంటి హోదా ఆమెకు అంత ఈజీగా ఏమీ రాలేదు. ఆమె సక్సెస్ ఫుల్ జీవితం వెనక ఏళ్ల తరబడి కష్టం, శ్రమ దాగి ఉంది. 16 ఏళ్ల వయసులోనే ఆమె సినిమా రంగంలోకి అడుగు పెట్టింది. ఆ కారణంగా ఆమె ఇప్పటి వరకు అసలు కాలేజ మొహమే చూడలేదు. సినిమానే తన జీవితంగా బ్రతికింది.

ఈ విషయమై ఇటీవల ఆమె ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ... ‘నేను 16 ఏళ్ల వయసులోనే సినిమా ఇండస్ట్రీలోకి వచ్చాను. సినిమాలే నా జీవితం. మామూలుగా అయితే ఈ వయసులో కాలేజీకి వెళ్లాలి. కానీ నేను సినిమాలే నా జీవితంగా ఎంచుకున్నాను. ఈ జీవితాన్ని నేను ఎంతో ఎంజాయ్ చేస్తున్నాను' అని తెలిపారు.

అందరిలా కాకుండా నేను డిఫరెంటు దారిని ఎంచుకోవాలనుకున్నాను. నేను ఎంచుకున్న కెరీర్లో చాలా సంతోషంగా ఉన్నాను. ఈ స్థాయికి రావడానికి చాలా కష్టపడ్డాను. నా జీవిత ప్రయాణంలో ఎంతో సంతృప్తిగా ఉన్నాను అని కరీనా కపూర్ చెప్పుకొచ్చారు.

కరీనా కపూర్
  

కరీనా కపూర్

చాలా చిన్న వయసులోనే కరీనా కపూర్ సినిమా రంగంలోకి అడుగు పెట్టారు.

బెబో
  

బెబో

తన జీవిత ప్రయాణంలో చాలా సంతోషంగా ఉన్నానని, ఎంచుకున్న కెరీర్లో సక్సెస్ కావడం ఆనందంగా ఉందని తెలిపారు.

తెరంగ్రేటం
  

తెరంగ్రేటం

అభిషేక్ బచ్చన్‌తో కలిసి కరీనా కపూర్ తెరంగ్రేటం చేసింది. ఆమె నటించిన తొలి సినిమా జెపి దత్తా దర్శకత్వంలో తెరకెక్కిన ‘రెఫుగీ'

హాట్ పిక్
  

హాట్ పిక్

కరీనా కపూర్ బాలీవుడ్ టాప్ స్టార్స్ సల్మాన్ ఖాన్, షారుక్ ఖాన్, అమీర్ ఖాన్ లతో కలిసి నటించే అవకాశం దక్కించుకుంది.

లవ్లీ పిక్చర్
  

లవ్లీ పిక్చర్

కరీనా కపూర్ నటించిన చివరి సినిమా ‘బజరంగీ భాయిజాన్' బాక్సాఫీసు వద్ద భారీ విజయం సాధించింది.

 

 

Please Wait while comments are loading...