కరీనా వెడ్డింగ్ డ్రెస్....అదరహో!
బాలీవుడ్ హాట్ లేడీ కరీనా కపూర్ త్వరలో తన తోటి స్టార్ సైఫ్ అలీఖాన్‌ను పెళ్లాడుతున్న విషయం తెలిసిందే. అక్టోబర్ 16, 2012లో వీరి వివాహం జరుగనుంది. కరీనా పెళ్లి రోజు వేసుకోబోయే డ్రెస్ ఏమిటో ఖరారైంది. ఆమె తన పెళ్లి రోజు తన అత్తగారు, సైఫ్ తల్లి షర్మిలా ఠాగూర్ 43ఏళ్ల క్రితం మన్సూర్ అలీఖాన్ పటౌడీని పెళ్లి చేసుకున్నప్పుడు వేసుకున్న 'షారారా'ను ధరించనుందట.
పటౌడీ ఫ్యామిలీలో తర తరాలుగా ప్రత్యేకంగా తయారు చేయించిన షారారాను ధరించడం ఆనవాయితీగా వస్తోంది. షర్మిలా ఠాగూర్ తన పెళ్లిలో ధరించిన షారారాను ధరించడం తన జీవితంలోను బిగ్గెస్ట్ మూమెంట్‌గా భావిస్తోంది ఈ భామ. దాదాపు ఐదారు సంవత్సరాల నుంచి సైఫ్, కరీనా సహజీవనం చేస్తున్నారు.
ఇటు సైఫ్, అటు కరీనా రాయల్ ఫ్యామిలీలకు చెందిన వారు కావడంతో వీరి పెళ్లి దేశంలో అతిపెద్ద వేడుకల్లో ఒకటిగా నిలిచి పోయే విధంగా ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలుస్తోంది. పెళ్లికి సంబంధించిన ఏర్పాట్లు ఇప్పటి నుంచే మొదలు పెడుతున్నారు. 41 ఏళ్ల సైఫ్ 1991లో హీరోయిన్ అమృత సింగ్‌ను పెళ్లాడాడు. 13 ఏళ్ల కాపురం తర్వాత ఇద్దరి మధ్య విబేధాలు రావడంతో ఇద్దరు పిల్లులు పుట్టిన తర్వాత 2004లో విడాకులు తీసుకున్నారు. కరీనా కూడా గతంలో షాహిద్ కపూర్‌తో మూడేళ్ల పాటు ఘాటైన ప్రేమాయణం సాగించింది. ఆ తర్వాత అతనితో విడిపోయి సైఫ్‌తో బంధం ఏర్పరుచుకుంది.


Click it and Unblock the Notifications











