twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    కరీనా సెక్సీ చీర వేలానికి..

    By Bojja Kumar
    |

    బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కరీనా కపూర్ ముఖ్య పాత్రలో...చాందినీ బార్, ఫ్యాషన్ లాంటి చిత్రాలను తెరకెక్కించిన మధుర్ బండార్క్ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం 'హీరోయిన్'. ఈ చిత్రంలోని 'హల్ కత్ జవానీ' సాంగులో కరీనా పింక్ సారీ, డార్క్ బ్లూ జాకెట్ వేసుకుని సెక్సీగా ఆడి పాడింది.

    తాజాగా ఈ చీర, జాకెట్ వేళానికి వేయాలని నిర్ణయించారు. తద్వారా వచ్చిన మొత్తాన్ని సేవా కార్యక్రమాలకు వినియోగించనున్నారు. సినిమాకు పబ్లిసిటీ పెంచడంలో భాగంగానే ఈ వేలం ప్లాన్ వేశారు దర్శక నిర్మాతలు. మరి ఈ చీరను ఎవరు? ఎంతకు దక్కించుకుంటారో చూడాలి.

    బార్ గర్ల్స్, మోడల్స్ జీవితాలు తెర వెనక ఎలా ఉంటాయి అని తన గత చిత్రాలో కళ్లకు కట్టినట్లు చూపించిన మధుర్...ఈ సారి హీరోయిన్ల జీవితాల్ని 'హీరోయిన్' చిత్రంలో ఆవిష్కరించనున్నారు. ముఖ్యంగా ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా కింది స్థాయి నుంచి వచ్చిన హీరోయిన్ల జీవితం ఎలా ఉంటుంది, వారు ఎదుర్కొన్న పరిస్థితులు ఏమిటి? అనే అంశాన్ని బేస్ చేసుకుని ఈచిత్రాన్ని నిర్మించారు.

    సెప్టెంబర్ 21వ తేదీన ఈచిత్రాన్ని భారీగా రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. రోనీ, మాధుర్ బండార్క్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈచిత్రానికి దాదాపు రూ. 18 కోట్లు ఖర్చు పెట్టారు. గతంలో మాధర్ దర్శకత్వంలో వచ్చిన చాందినీ బార్, ఫ్యాషన్, పేజ్ త్రీ, ట్రాఫిక్ సిగ్నల్ చిత్రాలకు మంచి గుర్తింపు వచ్చింది. పైగా కరీనా కపూర్ హీరోయిన్ కావడంతో ఈ చిత్రంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.

    English summary
    Ever since Kareena Kapoor featured in her bright pink saree and dark blue blouse in her item song Halkat Jawaani in Madhur Bhandarkar’s upcoming film, her costume became the talk of town. And now buzz is that the same ensemble is being auctioned for a cause.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X