నాకు నేనే పోటీ అంటూ..తన రికార్డులను తానే బ్రేక్ చేసుకుంటోంది..!?
బాలీవుడ్ లో ఇప్పుడు కరీనాకపూర్ హవా నడుస్తోంది. ఒక స్టార్ హీరోయిన్ కి ఉండవలసినది కమెర్షియల్ అవేలబ్యులిటీ, అది కరీనా కపూర్ లోనే ఉంది. ఒక యాక్టర్ గా ఒక హీరోయిన్ గా మంచి ఇమేజ్ తెచ్చుకొన్నది కరీనాకపూర్. కరీనాకపూర్, షారూక్ ఖాన్ సరసన నటించిన 'రా.వన్" త్వరలో విడుదలకు సిద్ధమవుతోంది. ఈ చిత్రం ద్వారా తను సరికొత్త ఫీట్ సాధించబోతున్నట్లు ఈ సుందరి ప్రకటించింది.
రా.వన్ దాదాపు 100కోట్లకు పైగా బిజినెస్ చేయొచ్చని ట్రేడ్ వర్గాలు భావిస్తున్నాయి. గతంలో కరీనాకపూర్ నటించిన 'త్రీ ఇడియట్స్, గోల్‌మాల్, బాడీగార్డ్" చిత్రాలు కూడా వంద కోట్ల కలెక్షన్ల మార్క్‌ను దాటాయి. దీంతో ఈ చిత్రాల్లో నటించిన కథానాయికగా అరుదైన ఫీట్ సాధించింది కరీనాకపూర్. ఈ విషయమై ఆమె స్పందిస్తూ 'అమీర్ ఖాన్, అజయ్ దేవ్ గన్, సల్మాన్ ఖాన్ లతో నటించిన మూడు చిత్రాలు వందకోట్ల కలెక్షన్లను రాబట్టాయి.
ఇప్పుడు షారుక్ తో నటించిన రా.వన్ చిత్రం కూడా కమర్షియల్ గా 100 కోట్లు వసూళ్లు దాటుతుందని విశ్లేషించడం ఆనందంగా వుంది. ప్రతి చిత్రంతో నా గత చిత్రాల బాక్సాఫీస్ రికార్డ్ లను నేనే బ్రేక్ చేసుకోవడం ఆనందంగా వుంది. నాకు నేనే పోటీ పడుతున్నాననే భావన కలుగుతోంది. ఏ కథానాయికకైనా కమర్షియల్ సక్సెస్ చాలా ముఖ్యం. నా అభిమానుల్ని అలరించడమే నా కర్తవ్యం. ఈ విషయాన్ని నేనెప్పుడూ మరిచిపోను" అని కరీనా కపూర్ చెబుతోంది.


Click it and Unblock the Notifications











