'హీరోయిన్'కే 8కోట్లు ఇస్తున్నారు
కేవలం హీరోయిన్ రెమ్యునేషన్ ఎనిమిది కోట్లు ఇస్తే ఇంక బడ్జెట్ ఏమి మిగిలుతుంది సినిమా పూర్తి చేయటానికి అనే సందేహాలు ఇప్పుడు బాలీవుడ్ లో మొదలయ్యాయి. మధూర్ బండార్కర్ తాజా చిత్రం 'హీరోయిన్' కోసం కరీనా కపూర్ ని సంప్రదించారు. మొదట ఐశ్వర్యారాయ్ అనుకున్న ఈ ప్రాజెక్టు ఆమె దగ్గరకు చేరటంతో ఆమె స్క్రిప్టులో మార్పులు చేయాలని, తన రెమ్యునేషన్ పది కోట్లు చెల్లించాలని కండీషన్ పెట్టింది. దాంతో వేరే దారిలేని దర్శక, నిర్మాతలు స్క్రిప్టులో ఆమె కోరిన మార్పులు చేసి అంత ఇచ్చుకోలేమని ఎనిమిది కోట్లుతో సరిపెట్టుకోమని ఎగ్రిమెంట్ రాసుకున్నారు.
ఇప్పటివరకూ ఏ హీరోయినేకి ఇవ్వని రెమ్యునేషన్ ఆమె పొందుతూండటంతో ఆమె హాట్ టాపిక్ గా మారింది. ఇక ఈ చిత్రం త్వరలోనే షూటింగ్ మొదలు కానుంది. మార్లిన్ మన్రో జీవితాన్ని ఆధారం చేసుకుని దర్శకుడు మధూర్ ఈ కథను అల్లినట్లు సమాచారం. వాస్తవ జీవితానికి దగ్గరగా ఉండే కధాంశంతో తెరకెక్కే ఈ చిత్రం విడుదల అయితే చాలా సంచలనాలకు తెరతీస్తుందని భావిస్తున్నారు. తెరపై కనిపించేంత అందంగా హీరోయిన్స్ జీవితాలు ఉండవని ఈ చిత్రంతో దర్శకుడు చెప్పబోతున్నాడు. గతంలో మధూర్ బండార్కర్ తీసిన ఫ్యాషన్, చాందినీబార్, పేజ్ త్రీ, కార్పోరేట్ చిత్రాలు మంచి పేరు తెచ్చిపెట్టి అతన్ని స్టార్ డైరక్టర్ ని చేసాయి.


Click it and Unblock the Notifications











