‘హీరోయిన్’ స్మోకింగ్, డ్రింకింగ్ ఫుల్లుగా...
చిత్రం షూటింగులో భాగంగా కరీనా కపూర్‌తో స్మోకింగ్, డ్రింకింగ్ చేయిస్తున్నాడు దర్శకుడు మధుర్ బండార్కర్. దీని గురించి కరీనా మాట్లాడుతూ నాకు పొగంటే అస్సలు పడదు. కానీ పాత్రకు అనుగుణంగా రోజుకు పెట్టెలకు పెట్టెలు సిగరెట్లు తాగాల్సి వస్తోంది. దీని మూలంగా నా ఆరోగ్యం కూడా మందగిస్తోంది అంటు చెప్పుకొచ్చింది.
ఈ చిత్రంలో తను పోషిస్తున్న హీరోయిన్ మహి పాత్ర గురించి వెల్లడిస్తూ...నటిగా నా జీవితానికి అర్థం చెప్పే పాత్ర ఇది. ఈ పాత్రను సమర్థవంతంగా పోషించడానికి ఎన్నో త్యాగాలు చేయాల్సి వస్తోంది. ఈ పాత్ర నాకు తగిన గౌరవాన్ని అందిస్తుందనే నమ్మకం ఉంది అని తెలిపింది.
తాను రాయల్ సినీ ఫ్యామిలీ నుంచి వచ్చాను కాబట్టి హీరోయిన్ కావడానికి పెద్దగా కష్ట పడలేదు. కానీ ఈ సినిమా చేస్తున్నప్పుడు తెలుస్తోంది... ఏ బ్యాగ్రౌండ్ లేకుండా హీరోయిన్లుగా అయిన వారు ఎంత దయనీయ పరిస్థితి నుంచి వచ్చారో, నిజంగా వారు ఎదుర్కొన్న పరిస్థితులు చాలా దారుణంగా ఉంటాయి. తెరపై వాటిని చూసి మీరు కూడా చలిస్తారు అని చెప్పుకొచ్చింది.
గతంలో మాధుర్ బండార్కర్ చాందినీ బార్, ఫ్యాషన్, పేజ్ త్రీ, ట్రాఫిక్ సిగ్నల్ అనే చిత్రాలను రూపొందించి ఆయా రంగాల్లోని వాస్తవికతను ప్రేక్షకుల ముందు ఉంచాడు. ఆ చిత్రాలు ప్రేక్షకాదరణ పొందడంతో పాటు విమర్శలకు ప్రశంసలు అందుకున్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా ఆయన రూపొందిస్తున్న 'హీరోయిన్' చిత్రంపై కూడా మంచి అంచనాలున్నాయి.


Click it and Unblock the Notifications












