రెడ్ లైట్ ఏరియాలో టాప్ హీరోయిన్ కరీనా?

By Bojja Kumar

ముంబై : మీరు విన్నది నిజమే. టాప్ హీరోయిన్ కరీనా కపూర్ రెడ్ లైట్ ఏరియాలో ప్రత్యక్షమైంది. అయితే ఆమె రెడ్ లైట్ ఏరియాలో చేయకూడని చట్టవ్యతిరేకమైన పనులు చేస్తుందని మాత్రం అనుకోవద్దు. కరీనా అక్కడికి వెళ్లడానికి ఓ కారణం ఉంది. సినిమా షూటింగులో భాగంగానే రెడ్ లైట్ ఏరియాలో దర్శనం ఇచ్చింది.

రీమా కాగ్టి దర్శకత్వంలో రూపొందుతున్న 'తలాష్'లో కరీనా కపూర్ నటిస్తున్న సంగతి తెలిసిదే. ఈచిత్రానికి సంబంధించిన 'జియా లగే నా' అనే సాంగ్ చిత్రీకరిస్తున్నారు. ఈ సాంగులో భార్య రాణి ముఖర్జీని వదిలేసిన అమీర్ ఖాన్ బెబోను వెతుకుతూ రెడ్ లైట్ ఏరియా వైపు వెళ్లే సన్నివేశాలను చూపెట్టనున్నారు.

ఈ చిత్రంలో అమీర్ ఖాన్ పోలీసాఫీసర్ పాత్ర చేస్తున్నాడు. ఈ చిత్రం నవంబర్ 30న విడుదలకు సిద్ధం అవుతోంది. రీమా కాగ్టి దర్శకత్వం వహిస్తున్న ఈచిత్రాన్ని రితేష్ సిద్వాని, అమీర్ ఖాన్, ఫరాన్ అక్తర్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి స్క్రీన్ ప్లే, కథ : రీమా కాగ్టి, జోయా అక్తర్, సంగీతం : రామ్ సంపత్, సినిమాటోగ్రఫీ : మోహన్, ఎడిటింగ్ : ఆనంద్ సుబ్బయ్య,

'తలాష్'కి సంబంధించిన థియేరిటికల్ రైట్స్ ని రిలయన్స్ సంస్థ రూ. 90కోట్ల భారీ మొత్తానికి చేజిక్కించుకుంది. గతంలో షారూక్‌ఖాన్ 'డాన్2' చిత్రానికి ఇవే థియేరిటికల్ రైట్స్ క్రింద 80 కోట్లు లభించాయి. దాంతో ఇప్పుడు ఆ రికార్డుని చెరిపేసి కొత్త రికార్డుని క్రియేట్ చేసినట్లైంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X