ఫస్ట్ లుక్: సంగీత్ డ్రెస్‌లో కరీనా
ముంబై: బాలీవుడ్ హాట్ జంట సైఫ్ అలీఖాన్-కరీనా కపూర్ పెళ్లి డేట్ ఫిక్సయిన విషయం తెలిసిందే. అక్టోబర్ 17న వారిద్దరూ మనువాడనున్నారు. తాజాగా కరీనా సంగీత్ డ్రెస్ లో కెమెరాకు చిక్కింది. ఆదివారం రాత్రి ముంబైలో కరీనా, సైప్ సన్నిహితులు, స్నేహితుల మధ్య సంగీత్ కార్యక్రమం గ్రాండ్ గా జరిగింది.
కరీనా వేసుకున్న డ్రెస్‌ను ప్రముఖ బాలీవుడ్ డ్రెస్ డిజైనర్ మనీష్ మల్హోత్రా డిజైన్ చేసారు. ఈ నెల 17న విహానికి అన్ని ఏర్పాట్లు గ్రాండ్ గా చేస్తున్నారు. అక్టోబర్ 18న పటౌడీ ప్లేస్‌లో రిసెప్షన్ జరుగనున్నట్లు తెలుస్తోంది. తాజాగా అందిన సమాచారం ప్రకారం కరీనా తన పెళ్లి వేడుక కోసం రూ. 40 లక్షల విలువ చేసే రాయల్ నక్లెస్‌ను ప్రత్యేకంగా తయారు చేయించారట.
రాజ్ కోట్ సంబంధించిన ఆభరణాల నిపుణులు దీన్ని తయారు చేసినట్లు తెలుస్తోంది. ఇందు కోసం 400 గ్రాముల బంగారం, వజ్రాలు పొదిగి దీన్ని తయారు చేస్తున్నారు. మరో వైపు సైఫ్ కరీనా వేలికి తొడిగేందుకు అరుదైన మేలిమి వజ్రంతో ఖరీదైన ఉంగరం రెడీ అయింది.
నాలుగైదేళ్లుగా వీరిద్దరూ చెట్టాపట్టాలేసుకొని తిరుగుతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే సైఫ్ అలీఖాన్‌కు పెళ్లీడుకొచ్చిన పిల్లలు కూడా ఉన్నారు. అలాంటిది ఆయన కరీనాతో పెళ్లికి రెడీ అవుతుండటం... దానికి కరీనా ఎలాంటి అభ్యంతరం లేకుండా ఓకే చెప్పేయడం విశేషం.


Click it and Unblock the Notifications











