వరల్డ్ హాట్ లేడీగా ‘కరీనా’
ముంబై : బాలీవుడ్ సెక్సీ లేడీ కరీనా కపూర్ తాజాగా వరల్డ్ హాట్ లేడీ 2012గా అవతరించింది. ప్రముఖ అంతర్జాతీయ మేగజైన్ 'మాక్సిమ్' ఈ ఏడాది నిర్వహించిన సర్వేలో పాల్గొన్న వారంతా.. మన 'బెబో'నే 'హాటెస్ట్ గర్ల్'గా ఎంపిక చేశారు. దీంతో 'మాక్సిమ్' తాజా సంచిక ముఖచిత్రంపై కరీనా కనువిందు చేయనుంది.
తనను హాట్ లేడీగా అభిమానులు అందలం ఎక్కించడంపై బెబో స్పందిస్తూ... "సెక్సీగా, హాట్‌గా ఉన్నామంటే చాలా ఆనందంగా ఉంటుంది.అదీ 'మాక్సిమ్' నుంచి కావడంతో మరింత సంతోషంగా ఉంది. అయినా.. 'హాట్‌నెస్' అనేది సన్నని నడుము, పొడుగైన కాళ్లతో రాదు.. అది మొత్తం శరీరానికి, ప్రవర్తనకు సంబంధించినది. నన్ను 'హాట్‌గర్ల్'గా ఎంపిక చేసి నవారందరికీ కృతజ్ఞతలు.. దీనిని గొప్ప ప్రశంసగా భావిస్తా'' చెప్పింది.
కరీనా త్వరలో 'హీరోయిన్' చిత్రం ద్వార ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. బార్ గర్ల్స్, మోడల్స్ జీవితాలు తెర వెనక ఎలా ఉంటాయి అని తన గత చిత్రాలో కళ్లకు కట్టినట్లు చూపించిన మధుర్...ఈ సారి హీరోయిన్ల జీవితాల్ని 'హీరోయిన్' చిత్రంలో ఆవిష్కరించనున్నారు. సెప్టెంబర్ 21వ తేదీన ఈచిత్రాన్ని భారీగా రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. రోనీ, మాధుర్ బండార్క్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈచిత్రానికి దాదాపు రూ. 18 కోట్లు ఖర్చు పెట్టారు.


Click it and Unblock the Notifications












