కరీనా రహస్యాలు బయటపెట్టే బుక్!
ముంబై: బాలీవుడ్ సెక్సీ స్టార్లెట్ కరీనా కపూర్ రచయిత అవతారం ఎత్తబోతోంది. తన నాజుకైనా అందాలతో, స్లిమ్ పర్సనాలిటీతో టాప్ హీరోయిన్‌గా కొనసాగుతున్న బెబో తను రాసే పుస్తకంలో తన జీవితంలోని సంఘటనలు వెల్లడించనుంది. తన సోదరి కరిష్మా కపూర్‌తో కలిసి సినిమా షూటింగులకు వెళ్లే కాలం నాటి నుంచి నేటి వరకు జరిగిన సంఘటనలను ఇందులో ప్రస్తావించనుంది. వాటితో పాటు తన బ్యూటీ రహస్యాలను, తన డైటింగ్ టిప్స్‌ను తెలియ పరచనుందట. స్వయంగా కరీనానే ఈ పుస్తకం రాస్తోంది.
డిసెంబర్ నెలకల్లా ఈ పుస్తకం మార్కెట్‌లోకి రానుంది. పుస్తకం రాయడం కొంత పూర్తయిందని, పూర్తి కాగానే పూర్తి వివరాలు వెల్లడిస్తానని కరీనా వెల్లడించింది. పెంగ్విన్ బుక్స్ ఇండియా వారు ప్రచురించే ఈ పుస్తకానికి ఇంకా టైటిల్ ఖరారు కావాల్సి ఉంది. కరీనా వ్యక్తిగత డైటీషియన్ రుజుతా దివాకర్ ఇందులో ముందు మాట రాయనన్నారు.
కరీనా కపూర్ నటించిన 'హీరోయిన్' చిత్రం సెప్టెంబర్ 21న విడుదలకు సిద్దం అవుతోంది. రోనీ, మాధుర్ బండార్క్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈచిత్రానికి దాదాపు రూ. 18 కోట్లు ఖర్చు పెట్టారు. గతంలో మధుర్ దర్శకత్వంలో వచ్చిన చాందినీ బార్, ఫ్యాషన్, పేజ్ త్రీ, ట్రాఫిక్ సిగ్నల్ చిత్రాలకు మంచి గుర్తింపు వచ్చిన నేపథ్యంలో ఈ చిత్రంపై మంచి అంచనాలున్నాయి.
కరీనా మరో వైపు అమీర్ ఖాన్ హీరోగా రూపొందిన 'తలాష్' చిత్రంలో నటించింది. ప్రస్తుతం పోస్టు ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్నీ చిత్రం నవంబర్ 30న విడుదల కానుంది.


Click it and Unblock the Notifications












