అనురాగ్ దర్శకత్వంలో ‘కరీనా బొమ్మాళీ’...!
శ్యాంప్రసాద్ రెడ్డి నిర్మాతగా కోడిరామకృష్ణ దర్శకత్వంలో అనుష్క ప్రధాన పాత్రలో నటించిన 'అరుంధతి" తెలుగులో అద్భుత విజయం సాధించిన విషయం సాధించింది. ఈ సినిమా తెలుగులోనే గాక తమిళ, మళయాళ భాషలలో కూడా భారీ విజయం సాధించింది. ఈ మధ్య దక్షినాది సినిమాలను రీమేక్ చేస్తున్న బాలీవుడ్ ఈ సినిమాపై కన్నేసింది. ఈ సినిమాకి దర్శకుడు కూడా ఖరారయ్యాడు. గ్యాంగస్టర్, లైఫ్ ఇన్ మెట్రో, కైట్స్ చిత్రాలు డైరక్ట్ చేసిన అనురాగ్ బసు ఈ చిత్రానికి దర్శకత్వం వహించనున్నాడు.ఈ సినిమా హిందీ రిమేక్ రైట్స్ జెమిని ఫిలిం సర్క్యూట్ తీసుకుంది.
తెలుగులో వచ్చిన 'అరుంధతి' సినిమా పెద్ద హిట్ అవడమే కాకుండా, అందులో కథానాయికగా నటించిన అనుష్క కెరీర్ కు టర్నింగ్ పాయింట్ కూడా అయింది. రీమేక్ వెర్షన్ లో కూడా అనుష్కే నటిస్తుందని వార్తలు కూడా వచ్చాయి. అయితే, ఆమె ఆసక్తి చూపకపోవడంతో నిర్మాతలు పలువుర్ని ఈ పాత్రకు పరిశీలించారు. చివరికి కరీనా కపూర్ ఈ చిత్రాన్ని చేయడానికి అంగీకరించిందని తాజాగా చెబుతున్నారు. తెలుగు వెర్షన్ చూసిన కరీనా ఎంతో ఇన్స్ పైర్ అయిందనీ, అనుష్క అభినయాన్ని ఎంతగానో మెచ్చుకుందనీ తెలుస్తోంది. త్వరలోనే ఆమె ఈ చిత్రానికి డేట్స్ ఇవ్వనుందట. అనురాగ్ బసూ దీనికి దర్శకత్వం వహిస్తాడు.


Click it and Unblock the Notifications











