‘హీరోయిన్’ కోసం కరీనా 130 కాస్ట్యూమ్స్
మధుర్ బండార్కర్ దర్శకత్వంలో యూటీవీ మోషన్ పిక్చర్స్ రూపొందిస్తున్న సిసిమా 'హీరోయిన్". ఇందులో బాలీవుడ్ టాప్ స్టార్ కరీనా కపూర్ టైటిల్ రోల్ చేస్తోంది. ఈ సినిమా కోసం కరీనా 130 కాస్టూమ్స్ వేయనుందట. వీటిని ప్రముఖ డిజైనర్ మనీష్ మల్హోత్రాతో ప్రత్యేకంగా డిజైన్ చేస్తున్నారు. సినిమా యూనిట్ సభ్యుల నుంచి అందిన సమాచారం ప్రకారం కేవలం ఈ కాస్టూమ్స్ కోసమే రూ. 1.2 కోట్లు ఖర్చు పెడుతున్నారని తెలుస్తోంది. గతంలో ఐశ్వర్యరాయ్ లీడ్ రోల్ లో ఈ సినిమా షూటింగ్ ప్రారంభం అయినప్పుడే రూ. 5 లక్షల విలువ చేస్తే కాస్టూమ్స్ డిజైన్ చేయించారు.
గర్భం దాల్చిన కారణంగా ఐశ్వర్య అర్ధాంతరంగా సినిమా నుంచి సైడ్ అయి పోవడంతో కరీనాను ఎంపిక చేశారు. దీంతో ఆ దుస్తులు ఇప్పడు పనికి రాకుండా పోయాయి. మళ్లీ ఫ్రెష్ గా కరీనా కోసం వాటిని తయారు చేయిస్తున్నారు. సినిమా పూర్తయ్యే నాటికి మొత్తం 130 కాస్టూమ్స్ కరీనా ధరించాల్సి ఉంది. వీటన్నింటికీ కలిపి రూ. 1.2 కోట్లు ఖర్చు అవుతుందని అంటున్నారు. అక్టోబర్ తొలి వారంలో కరీనా కొలతలు తీసుకుని ఆమెకు ఫిట్ అయ్యే విధంగా కాస్టూమ్స్ డిజైన్ ప్రారంభం కానుంది.


Click it and Unblock the Notifications











