కరీనా బర్త్ డే సెలబ్రేషన్స్ కాన్సిల్
బాలీవుడ్ టాప్ హీరోయిన్ కరీనా కపూర్ తన పుట్టిన రోజు వేడుకలను కాన్సిల్ చేసుకుంది. వాస్తవానికి రేపు(సెప్టెంబర్ 21) ఆమె 31వ బర్త్ డే సెలఃబ్రేషన్స్ సినీ ప్రముఖలు, సన్నిహితుల మధ్య వైభవంగా జరుగాల్సి ఉంది. అయితే ఓ బలమైన కారణం చేత కరీనా ఈ నిర్ణయం తీసుకుంది. కరీనా తన సహచర నటుడు సైఫ్ అలీ ఖాన్ తో గత కొన్ని రోజులుగా సహజీవనం చేస్తోంది. ఈ క్రమంలో సైఫ్ కుటుంబంతో బెబోకు మంచి అనుబంధం కూడా ఏర్పడింది. అయితే ప్రస్తుతం సైఫ్ తండ్రి మన్సూర్ అలీఖాన్ అనారోగ్యంతో మంచం పట్టారు. ఈ తరుణంలో పుట్టిన రోజు సంబరాలకు దూరంగా ఉండాలని నిర్ణయించుకుందట కరీనా.
ప్రస్తుతం కరీనా నటించిన 'బాడీగార్డ్" సినిమా సూపర్ హిట్ టాక్‌తో భారీ వసూళ్లు సాధిస్తూ దూసుకెలుతోంది. ఈ సినిమా విజయోత్సవ వేడుకలు త్వరలో భారీ గా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ కార్య్రకమంలోనే కరీనా బర్త్ డే వేడుకలు ఘనంగా జరుపడానికి సల్మాన్ అంట్ బాడీగార్డ్ సినిమా టీం ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. నేరుగా పుట్టిన రోజు వేడుకలు జరుపుకోకుండా బాడీగార్డు సినిమా ఫంక్షన్‌లో పుట్టిన రోజు వేడుకలు జరుపుకునేందుకు కరీనా కూడా సుముఖత వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది.


Click it and Unblock the Notifications











